hyderabadupdates.com Gallery మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్

మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్

మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్ post thumbnail image

హైదరాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌స్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు ఉన్న‌ట్టుండి కొత్త ఏడాది క‌లిసి వచ్చింది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడి పోయారు. ఇక్క‌డ ఎమ్మెల్యే గా ఉన్న గాంధీ అనారోగ్యంతో మృతి చెంద‌డంతో మ‌రోసారి ఇక్క‌డి నుంచే పోటీ చేసేందుకు ట్రై చేశారు. చివ‌ర‌కు ఏమైందో ఏమో కానీ హైక‌మాండ్ త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చింది. అంతే కాదు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న‌ను మ‌లివిడ‌త కేబినెట్ లోకి మంత్రిగా తీసుకుంది. కీల‌క‌మైన శాఖ‌ల‌ను అప్ప‌గించింది అజారుద్దీన్ కు .ప్ర‌ధానంగా అత్య‌ధికంగా జ‌నాభా క‌లిగిన మైనార్టీల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే ప్ర‌ధాన డిమాండ్ అంత‌టా పెరిగింది.
ఈ త‌రుణంలో అనూహ్యంగా రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ త‌ర‌పున ఎమ్మెల్సీగా ఉన్న క‌ల్వ‌కుంట్ల క‌విత ఇంట్లో విభేదాల కార‌ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారితో తెగ‌తెంపులు చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాను తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా ఉన్నారు. జ‌నం బాట పేరుతో జ‌నంలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు తాను బీఆర్ఎస్ నుంచి వ‌దిలేసి రావ‌డంతో ఇక ఆ పార్టీ నుంచి వ‌చ్చిన ప‌ద‌వి త‌న‌కు అక్క‌ర్లేద‌ని భావించారు. ఈమేర‌కు శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి తాను రాజీనామా చేసిన లేఖ‌ను స‌మ‌ర్పించింది. చివ‌ర‌కు త‌ను తాత్సారం చేయ‌డంతో తిరిగి త‌న రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరింది. ఆయ‌న ఓకే చెప్ప‌డంతో త్వ‌ర‌లోనే ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో అజ్జూకి లైన్ క్లియ‌ర్ అయ్యింది.
The post మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపుఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర స‌ర్కార్ తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. ఈ మేర‌కు సానుకూలమైన వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డంతో విస్తృతంగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా దావోస్ లో

తెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎంతెలుగు త‌ల్లికి జ‌ల‌హార‌తి ఇస్తాం : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భ వేదిక‌గా ఆయ‌న ప్ర‌సంగించారు. సాగు నీటి రంగంపై ప్ర‌సంగించారు. సాగు నీటి రంగానికి సంబంధించి మిగిలి పోయిన ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం

ఇండియాకు ఎప్పుడు వ‌స్తానో చెప్ప‌లేనుఇండియాకు ఎప్పుడు వ‌స్తానో చెప్ప‌లేను

ముంబై : మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఇరుక్కున్న ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎప్పుడు ఇండియాకు వ‌స్తానో తెలియద‌ని అన్నారు. త‌న‌కు రావాలంటే ఇక్క‌డ పాస్ పోర్టు రావాల్సి ఉంటుంద‌న్నారు. కానీ అది దొర‌క‌డం లేద‌న్నారు.