hyderabadupdates.com Gallery మ‌హాశ‌క్తి ప‌థ‌కం పేరుతో మ‌హిళ‌ల ద‌గా : ష‌ర్మిలా రెడ్డి

మ‌హాశ‌క్తి ప‌థ‌కం పేరుతో మ‌హిళ‌ల ద‌గా : ష‌ర్మిలా రెడ్డి

మ‌హాశ‌క్తి ప‌థ‌కం పేరుతో మ‌హిళ‌ల ద‌గా : ష‌ర్మిలా రెడ్డి post thumbnail image

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని , రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతీ లేకుండా పోయింద‌న్నారు. పండుగల పేరు చెప్పి కాలయాపన తప్పా మహిళా సాధికారితపై స‌ర్కార్ కు నిబ‌ద్ద‌త లేకుండా పోయిందంటూ ధ్వ‌జ‌మెత్తారు. పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరూ మహిళలు రెడీగా ఉండమని మరొకరు మాట్లాడార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ‌హిళ‌కు ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప చేసిన దాఖ‌లాలు లేవ‌న్నారు. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు చేసింది ఘరానా మోసమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి.
నెలకిచ్చే 15 వందలతో 15 వేలు చేస్తాం అన్నారని ధ్వ‌జ‌మెత్తారు. అంతే కాదు అర‌చేతిలో స్వ‌ర్గం చూపించార‌ని చివ‌ర‌కు దాని ఊసెత్త‌డం లేద‌న్నారు. 15 వేలను లక్షా 50 వేలకు ఆదాయం పెంచే మార్గం చూపుతాం అన్నార‌ని దానికి కూడా దిక్కు లేకుండా పోయిందంటూ మండిప‌డ్డారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలు త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ అని అది కూడా అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా భ‌రోసా ఇచ్చే హామీ ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు. ప్రతి ఏడాది 18 వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ వ‌చ్చారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.
The post మ‌హాశ‌క్తి ప‌థ‌కం పేరుతో మ‌హిళ‌ల ద‌గా : ష‌ర్మిలా రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌Tejashwi Yadav: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఉంటుంది – తేజస్వీయాదవ్‌

    ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్‌ 36వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం కారాకట్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న తేజస్వీ… ‘నాకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జేడీ మద్దతుదారులకు కృతజ్ఞతలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన

PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీPM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

    నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 9 కోట్లు.