న్యూఢిల్లీ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా కోటా చట్టాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. గురువారం పార్లమెంట్ సాక్షిగా ప్రసంగించారు. విపక్షాలను ఏకి పారేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న భయాలను తొలగించారు. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు . న్యూఢిల్లీలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు రాజకీయ రంగు పులమవద్దని ప్రతిపక్షాలను కోరారు. గతంలో దీనిని వ్యతిరేకించిన వారు ఎన్నికలలో తీవ్రంగా నష్టపోయారని వారు గుర్తుంచు కోవాలని హెచ్చరించారు.
నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న భయాలను తొలగిస్తూ, తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని మోదీ హామీ ఇచ్చారు. మహిళా కోటా చట్టాన్ని సవరించడానికి , డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో జోక్యం చేసుకున్నారు పీఎం. అన్ని పక్షాలు ఈ బిల్లులకు మద్దతు ఇస్తే, అది ఏ ఒక్క పక్షం రాజకీయాలకు అనుకూలంగా కాకుండా దేశానికి అనుకూలంగా ఉంటుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ చర్చకు వచ్చినప్పటి నుండి, గతంలో దీనిని వ్యతిరేకించిన వారిని దేశ మహిళలు క్షమించ లేదన్నారు. తదనంతరం జరిగిన ఎన్నికలలో వారు ఘోరంగా ఓడిపోయారన్నారు.
మహిళా కోటా చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును ఇవాళ లోక్‌సభలో ఓట్ల విభజన తర్వాత ప్రవేశ పెట్టారు. ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతిపాదిత సవరించిన మహిళా కోటా చట్టాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన డీలిమిటేషన్ బిల్లు , కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు అనే రెండు సాధారణ బిల్లులను కూడా సభలో ప్రవే శపెట్టారు.
The post మహిళా కోటా చట్టాన్ని రాజకీయం చేయొద్దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మహిళా కోటా చట్టాన్ని రాజకీయం చేయొద్దు
Categories: