hyderabadupdates.com Gallery మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా?

మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా?

అనుచరుడిని విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు పిలిస్తే మాజీ మంత్రి అక్కడకు వచ్చి నానా హడావుడి చేశారు. అనుచరులందరినీ గుంపులుగా వెంటబెట్టుకొచ్చి పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. వారిని బెదిరించారు. విచారణ కోసం పిలిపించిన నిందితుడిని పోలీసులు అనుమతి లేకుండా బయటకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. సర్కిల్ ఇన్స్‌పెక్టరును నానా దుర్భాషలాడారు. ఇన్ని జరిగిన తర్వాత పోలీసులు మాత్రం ఊరుకుంటారా? ఊరుకుంటే ఆయన బెదిరింపులకు జడుసుకొన్నట్లుగా అవుతుంది కదా? అందుకే కేసులు నమోదు చేసి దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నారు. ఇదంతా గోటితో పోయేదానిని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్న మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఓవరాక్షన్ కు సంబంధించిన వ్యవహారం!కొన్ని రోజుల కిందట మెడికల్ కాలేజీల వద్ద నిరసనలు చేపట్టడానికి సంబంధించి పోలీసులు కొందరికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. ఈ క్రమంలోభాగంగానే.. ఏ8గా ఉన్న వైసీపీ నాయకుడు మేకల సుబ్బన్నను కూడా విచారణ నిమిత్తం పిలిచారు. ఆ వెంటనే తన బలగాలతో కలిసి స్టేషనుకు వచ్చిన పేర్ని నాని.. సర్కిల్ ఇన్స్‌పెక్టరును నానా మాటలు అన్నారు. తీవ్రంగా బెదిరించారు. మా ప్రభుత్వం వస్తే మీ సంగతి చూస్తా అంటూ రెచ్చిపోయారు. సుబ్బన్నను చట్టప్రకారం విచారణకోసం పిలిచామని విచారించిన తర్వాత పంపేస్తాం అని సీఐ నచ్చజెబుతున్నప్పటికీ.. పేర్ని నాని పట్టించుకోలేదు. ఒక రేంజిలో ఎగిరెగిరిపడ్డారు. సుబ్బన్నను ఉరి తీస్తావా.. ఉరి వేసేయ్..  ఇప్పుడే ఉరేసేయ్.. అంటూ రంకెలు వేశారు. మాజీ మంత్రి చేసిన ఈ ఓవరాక్షన్ మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి.అయితే స్టేషను మీదకు వచ్చి ఇలా రాద్ధాంతం చేయడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించినందుకు మాజీ మంత్రి మీద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు  మీడియాకు వెల్లడించారు. సీఐను బెదిరించడం, దురుసుగా ప్రవర్తించడం సరికాదని ఆయన అంటున్నారు. పోలీసుస్టేషనుకు ఎవరైనా రావొచ్చునని, వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చునని అంతే తప్ప అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకు వెళ్లిపోతా అని దూకుడు ప్రదర్శించడం తగదని ఎస్పీ అంటున్నారు.తన అనుచరుడికి ఫేవర్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి స్టేషన్ మీదికి దూసుకెళ్లిన పేర్ని నాని.. కొత్త కేసుల్లో ఇరుక్కునేలా కనిపిస్తున్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 
The post మాజీ మంత్రి అతి.. కేసులో చిక్కుకోక తప్పదా? appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Durai Murugan: Vijay May Be Arrested if Investigation Warrants, If Needed, in Karur IncidentDurai Murugan: Vijay May Be Arrested if Investigation Warrants, If Needed, in Karur Incident

Chennai: In a sensational statement, Tamil Nadu Minister and senior DMK leader Durai Murugan said that if the investigation into the Karur foot-stomp tragedy deems it necessary, the state would

11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ

హైద‌రాబాద్ : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న తార‌, టీవీకే గ‌ణేష్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది.

హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారంహెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం

అమెరికా : ప్ర‌వాస భార‌తీయుల‌కు కోలుకోలేని షాక్ నిర్ణ‌యం తీసుకుంది అమెరికా స‌ర్కార్. హెచ్ -1బి వీసా కార్య‌క్ర‌మాన్ని ముగించ‌చే బిల్లును యుఎస్ శాస‌న స‌భ్యుడు ఇవాళ ప్ర‌వేశ పెట్టారు స‌భ‌లో. ఫ్లోరిడాకు చెంద‌ని రిప‌బ్లిక‌న్ ప్ర‌తినిధి గ్రెగ్ స్టీబ్ ఎండింగ్