హైదరాబాద్ : డైనమిక్ డైరెక్టర్ గా పేరు పొందిన హరీష్ శంకర్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా తాను డిఫరెంట్ కథతో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , శ్రీలీలతో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా గురించి కీలక అప్ డేట్ వచ్చింది. వచ్చే మార్చి నెలలో ఉస్తాద్ భగత్ రానుందని సంచలన ప్రకటన చేశారు మూవీ మేకర్స్. ఇదిలా ఉండగా తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కొడుకు, ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ తేజ, జాహ్నవి కపూర్ కలిసి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన పెద్ది మూవీ కూడా మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ప్రకటించడంతో పెద్ది మూవీ వాయిదా పడే ఛాన్స్ ఉందని సినీ వర్గాల భోగట్టా. అయితే హరీష్ శంకర్ కీలక ప్రకటన చేశారు. తమకు మార్చి వీలవుతుందని, అందుకే దానిని సెంటిమెంట్ గా భావించి రిలీజ్ కు సిద్దం చేశామన్నాడు. దీంతో అటు ఉస్తాద్ ఇటు పెద్ది మధ్య వార్ కొనసాగేందుకు వీలు లేదు. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ ఇటు రామ్ చరణ్ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. ఒకరు అబ్బాయి మరొకరు బాబాయ్. ఇక వాస్తవానికి పెద్ది మూవీ కూడా మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక రెండు సినిమాలు క్లాష్ కాకుండా తేదీలు మారే ఛాన్స్ ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు ఉస్తాద్ భగత్ సింగ్ ను.
The post మార్చిలో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మార్చిలో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్
Categories: