hyderabadupdates.com Gallery మార్చి 30 నుండి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

మార్చి 30 నుండి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

మార్చి 30 నుండి  శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు post thumbnail image

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. మార్చి 30వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవ రోజు మార్చి 31న శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 01న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవ మూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01వ తేదీ వరకు మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవను ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌.
The post మార్చి 30 నుండి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభివృద్ది నివేదిక‌నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభివృద్ది నివేదిక‌

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్, అటవీ పర్యావరణ శాఖల అభివృద్ధి గురించి నివేదిక‌ల‌తో కూడిన బుక్ లెట్ల‌ను

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలిభార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో భ‌ద్రతా కార‌ణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడ‌లేమంటూ పేర్కొన్నాయి. ఈ

Diwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలుDiwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలు

Diwali : పండగల వేళ.. ముఖ్యంగా దసరా, దీపావళి వేళ.. తమ సంస్థ ఉద్యోగులకు స్వీట్లు అందజేస్తాయి యాజమాన్యం. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో దీపావళీకి మిఠాయి షాపుల్లో స్వీట్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. అలాగే