hyderabadupdates.com movies ‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని కలిపి కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

మచిలీపట్నం నుంచి విజయవాడకు సుమారు 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు ఉండగా, ఈ మూడు నగరాలను కలిపే 110 కిలోమీటర్ల జాతీయ రహదారి పరిధిని మొత్తం క్యాపిటల్ ఏరియాగా ప్రకటించాలని సూచించారు. ఈ సమగ్ర ప్రాంతానికి ‘మావిగన్’ అనే పేరును ప్రతిపాదించారు.

తక్కువ బడ్జెట్‌తోనే ఈ ప్రాంతాన్ని రాజధాని తరహాలో అభివృద్ధి చేయవచ్చని పేర్కొంటూ, సుమారు రూ.2 లక్షల కోట్ల అంచనాలో కేవలం 10 శాతం పెట్టుబడితోనే గ్రోత్ ఇంజిన్‌లాంటి రాజధాని నిర్మించవచ్చని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వేగం తీసుకురావాలంటే మౌలిక వసతులు సిద్ధంగా ఉన్న ప్రాంతాన్ని వినియోగించుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం అమరావతి అంశంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రత్యామ్నాయ దృక్పథంగా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు జగన్ తెలిపారు. ఇప్పటికే రహదారులు, పట్టణాల అనుసంధానం, పారిశ్రామిక అవకాశాలు ఉన్న ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.

అయితే ‘మావిగన్’ అనే పేరుపై వివిధ అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని, అవసరమైతే వేరే పేరు కూడా పరిశీలించవచ్చని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.

Related Post

కార్పొరేట్ రంగంలోకి జేడీ.. ప్రశ్నిస్తున్న జనసైనికులుకార్పొరేట్ రంగంలోకి జేడీ.. ప్రశ్నిస్తున్న జనసైనికులు

సీబీఐ మాజీ సంయుక్త సంచాలకుడు, మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఈవి ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్యకలాపాల విభాగ

ఇవేం మాటలు అంబటి… ఓడినా మైండ్ సెట్ మారదా?ఇవేం మాటలు అంబటి… ఓడినా మైండ్ సెట్ మారదా?

దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా దరిద్రపుగొట్టు రికార్డు ఏపీ సొంతం. విభజన నేపథ్యంలో అటు ఇటు కాకుండా పోయిన ఏపీకి ఎప్పటికి రాజధాని సమకూరుతుందన్న ప్రశ్న సగటు ఆంధ్రోడ్ని వెంటాడి వేధిస్తోంది. నిజానికి రాజధాని అంశంపై జగన్ సర్కారు వ్యవహరించిన తీరు..