hyderabadupdates.com movies మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని అభిమానులు ఎగబడి చూస్తే అతడుని అంతగా పట్టించుకోలేదు. మగధీరని డిమాండ్ చేయని ఫ్యాన్స్ ఆరెంజ్ కు మాత్రం ప్రతిసారి బ్రహ్మరథం పడుతున్నారు. అలాని ఫ్లాపులన్నీ డబ్బులు తెస్తున్నాయని కాదు.

రెబెల్ లాంటివి వర్కౌట్ కాలేదు. ఇక అసలు విషయానికి వస్తే మార్చి 6 ప్రభాస్ మున్నా మళ్ళీ థియేటర్లకు వస్తోంది. వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ అప్పట్లో కమర్షియల్ ఫెయిల్యూర్. అంచనాలు అందుకోలేక ఓ మోస్తరుగా ఆడింది.

అయినా సరే కొన్ని స్టయిలిష్ యాక్షన్ ఎపిసోడ్స్, హారిస్ జైరాజ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మళ్ళీ చూడనిపించేలా ఉంటాయి. స్వంత తండ్రే హీరోకి విలన్ కావడం, అతన్ని చంపడమే లక్ష్యంగా స్టోరీ సాగడం అప్పటి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ప్రకాష్ రాజ్, ప్రభాస్ కాంబో అద్భుతమైన పెర్ఫార్మన్స్ జనాన్ని మెప్పించలేకపోయింది.

కానీ ఇప్పుడా సమస్య లేదు. జెన్ జీ కుర్రాళ్లకు నచ్చే ఛాన్స్ ఉంది. పైగా ఎలాగూ పాటల కోసమే జనాలు రీ రిలీజులను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి మున్నాలో వాటికి లోటు లేదు. ఇక మంచి స్ట్రాటజీ అని చెప్పేందుకు ప్రధాన కారణం ఒకటుంది.

మార్చి 6 భలే డేట్. విష్ణు విన్యాసం తప్ప చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేవు. దానికి టాక్ వచ్చిందా శ్రీవిష్ణు వసూళ్లు లాగేస్తాడు. కాంపిటీషన్ ఎలాగూ లేదు కాబట్టి రెండో ప్లేస్ మున్నా వాడుకోవచ్చు. సోషల్ మీడియాలో ఎస్విసి టీమ్ బాగానే పబ్లిసిటీ చేస్తోంది.

ఆరెంజ్ లాగా ఇది కూడా సర్ప్రైజ్ హిట్ అవ్వొచ్చనే నమ్మకంతో ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా నటించిన మున్నాలో గ్యాంగ్ స్టర్ నేపథ్యం ఉన్నప్పటికీ హుషారైన కాలేజీ ఎపిసోడ్స్ కూడా అలరిస్తాయి. మరి పంతొమ్మిది సంవత్సరాల క్రితం 2007లో వచ్చిన మున్నా ఇప్పుడు 2026లో ఏమైనా మేజిక్ చేస్తుందేమో చూడాలి.

Related Post

Padayappa Re-Release Surprise: AR Rahman Releases 33-Track OST for Rajinikanth FansPadayappa Re-Release Surprise: AR Rahman Releases 33-Track OST for Rajinikanth Fans

Superstar Rajinikanth’s Padayappa is heading back to theatres 25 years after it first hit the screens, with the re-release slated for December 12, 2025 – the actor’s birthday. And before

సౌండ్ లేదేంటి వరప్రసాద్ గారూసౌండ్ లేదేంటి వరప్రసాద్ గారూ

మాములుగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఓటిటిలో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మంచి హడావిడి ఉంటుంది. కానీ మన శంకరవరప్రసాద్ నెల రోజులకే డిజిటల్ లో వచ్చినా దాని తాలూకు సౌండ్ సోషల్ ఆన్ లైన్లో పెద్దగా లేదు. థియేటర్లలో రిలీజైనప్పుడు