hyderabadupdates.com Gallery మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలి

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలి

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్ల‌ను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాల‌ని పిలుపునిచ్చారు. ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు చేయాల‌ని, ఏ ఒక్క సీటు కోల్పోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్య‌త మీపైనే ఉంద‌న్నారు. శ‌నివారం సీఎం టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ప్రసంగించారు. ఈ ఎన్నిక‌లు మ‌న‌కు అత్యంత ప్ర‌ధాన‌మ‌ని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్ప‌ష్టం చేశారు సీఎం. ఆయా ప్రాంతాల‌లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని, రెబల్స్‌ను బుజ్జగించాలని సూచించారు. అంతే కాకుండా టికెట్ల‌ను ఆశించి భంగ‌ప‌డిన వారిని, రెబ‌ల్స్ ను స‌ముదాయించాల‌ని అన్నారు.
నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి యునైటెడ్ స్టేట్స్ నుండి ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహాలను సమీక్షించారు. ప్రతి డివిజన్, వార్డులో విజయం సాధించడంపై స్పష్టమైన దృష్టితో తదుపరి కార్యాచరణను రూపొందించాలని పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు , పార్టీ నాయకులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్ర‌తిప‌క్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ అభ్య‌ర్థుల‌కు ధీటుగా మ‌న అభ్య‌ర్థులు ఉండాల‌ని ఆదేశించారు. లేక పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. అంతేకాకుండా పార్టీకి అంతర్గత నష్టం జరగకుండా ఉండేందుకు రెబల్ అభ్యర్థులతో చర్చలు జరిపి, సమన్వయం ద్వారా సమస్యలను పరిష్కరించాలని నాయకులను ఆయన కోరారు.
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు , డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
The post మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలోకోకా కోలా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ ఇండియాలో

న్యూఢిల్లీ : ప్ర‌పంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఇదిలా ఉండ‌గా ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ను స్పాన్స‌ర్ చేస్తోంది ప్ర‌ముఖ శీత‌ల పానియాల సంస్థ కోకో కోలా. ఇదిలా ఉండ‌గా

14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాల‌యాల‌కు పెద్ద ఎత్తున బ‌స్సులు న‌డుపుతున్న‌ట్లు తెలిపారు. మొత్తం 2,243 స్పెష‌ల్ బ‌స్సులు కేటాయించామ‌న్నారు

DNA Test: ఢిల్లీ పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ డీఎన్‌ఏ పరీక్ష పలితం వచ్చేసిందిDNA Test: ఢిల్లీ పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ డీఎన్‌ఏ పరీక్ష పలితం వచ్చేసింది

    ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు సంస్థల అనుమానం నిజమయ్యింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నడిపారని డీఎన్‌ఏ పరీక్షా ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ