hyderabadupdates.com Gallery ముష్కిన్ చెరువులో నిర్మాణాలు వద్దు : హైడ్రా

ముష్కిన్ చెరువులో నిర్మాణాలు వద్దు : హైడ్రా

ముష్కిన్ చెరువులో నిర్మాణాలు వద్దు : హైడ్రా post thumbnail image

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. బుధ‌వారం ముష్కిన్ చెరువు ఎఫ్ టీ ఎల్ (ఫుల్ ట్యాంక్) ను అధికారులు ప‌రిశీలించారు. తాత్కాలిక షెడ్డుల్లో ఉంటున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. కొంద‌రు పావులుగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ఇక్క‌డి నుంచి ఖాళీ చేయాల‌ని, ఇందు కోసం 10 రోజుల గ‌డువు ఇస్తున్నామ‌ని హైడ్రా స్ప‌ష్టం చేసింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములను కొట్టేయాలని కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. నిర్మాణ వ్యర్థాలు, మట్టి పోసి.. చెరువు స్వరూపాన్ని మార్చేసి బడా నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారని మండిప‌డింది. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను తెచ్చి చెరువు పరిధిలో వేస్తున్నారని తెలిపింది. ఇక్కడే చెత్తను వేరు చేసి వ్యర్థాలను చెరువులోకి వదిలేస్తున్నార‌ని మండిప‌డింది.
దీంతో చెరువు కలుషితం అవుతోంది. ఇక్కడ ఉన్న తాత్కాలిక షెడ్డులు (నివాసాలు), దుకాణాలను పెట్టించి.. వారి ఆక్రమణలను తొలగించకుండా అడ్డుగా మిమ్ములను ముందుంచుతున్నారని పేర్కొంది. చెరువు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, మీరంతా ఖాళీ చేస్తే. చెరువును అభివృద్ధి చేయాలని చూస్తున్నాం అని వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ చెరువు అభివృద్ధి పనులు చేసేవారికి ఆటంకాలు కల్పించవద్దు అని అక్కడ తాత్కాలిక షెడ్డుల్లో ఉన్న వారికి హైడ్రా అధికారులు చెప్పారు. ప్రత్యామ్నాయం చూసుకుని చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఖాళీ చేయాలని సూచించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య, హైడ్రా ఏసీపీ శ్రీ తిరుమల్, ఇరిగేషన్ శాఖ డీఈ రమాదేవి తో పాటు.. పలువురు హైడ్రా అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అదికారులు అక్కడ తాత్కాలిక షెడ్డులు వేసుకుని నివాసముంటున్న వారితో మాట్లాడారు.
The post ముష్కిన్ చెరువులో నిర్మాణాలు వద్దు : హైడ్రా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Exciting Launch Update For Balakrishna-Gopichand Malineni’s NBK111Exciting Launch Update For Balakrishna-Gopichand Malineni’s NBK111

The highly awaited team-up of Nandamuri Balakrishna and director Gopichand Malineni has generated buzz throughout the industry, especially following their last blockbuster Veera Simha Reddy’s success at the box office.

సృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధిసృజ‌నాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ ద్వారా ఉపాధి

విజ‌యవాడ : పవిత్ర కృష్ణా నది తీరాన ప్రారంభమైన ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవనుందని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విజయవాడలో జరిగిన ఈ ఉత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కనుమరుగవుతున్న

విద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారువిద్యార్థి సూసైడ్ కేసులో ఆధారాలు చెరిపేశారు

కృష్ణా జిల్లా : రోజు రోజుకు సూసైడ్ ల సంఖ్య పెరుగుతోంది శ్రీ చైత‌న్య కాలేజీల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల సంఖ్య‌. తాజాగా కృష్ణా జిల్లా లోని పెన‌మ‌లూరు పోరంకిలో చ‌దువుకుంటున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ చేసుకోవ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం