hyderabadupdates.com movies మెగాస్టార్ సినిమా టికెట్ అక్షరాలా రూ.1,11,111

మెగాస్టార్ సినిమా టికెట్ అక్షరాలా రూ.1,11,111

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ సినిమా ఫీవర్‌ మొదలైంది. ఫస్ట్‌డే–ఫస్ట్‌షో టికెట్ల కోసం మెగా అభిమానులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో అమలాపురంలో జరిగే ప్రీమియర్‌ షో టికెట్‌ వేలంలో అభిమాని వెంకట సుబ్బారావు రూ.1.11 లక్షలకు టికెట్‌ను దక్కించుకోవడం సంచలనంగా మారింది.

నరసాపురంలోని అన్నపూర్ణ థియేటర్‌లో మరో టికెట్‌ రూ.లక్షా రెండు వేల వరకు పలికింది. అమలాపురంలో తొలి టికెట్‌ను బీజేపీ నాయకుడు వేలంలో సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ వేలం ద్వారా సమకూరిన మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ కు విరాళంగా అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. హీరోలపై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ చిత్రం జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, టికెట్ల వేలాలు ఇప్పటికే మెగా ఫీవర్‌కు నిదర్శనంగా మారుతున్నాయి.

Related Post

ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది: నారా లోకేష్ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది: నారా లోకేష్

ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది అంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రానున్న నేపథ్యంలో ఢిల్లీలో దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది. తాజాగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖకు వచ్చినది అతి పెద్ద

నేను పారిపోను..ప్రశాంత్ కిషోర్నేను పారిపోను..ప్రశాంత్ కిషోర్

బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రశాంత్ కిషోర్ (PK)కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా తనకు నిద్ర కూడా సరిగా పట్టలేదని ఆయన నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ఒప్పుకున్నారు. ‘జన్ సూరజ్’ పార్టీ పెట్టి,

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎంఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. తాను ఇప్ప‌టి వ‌రకు ఒక్క సెల‌వు కూడా పెట్ట‌లేద‌న్నారు. ఒక‌వేళ ఏదైనా రోజు సెల‌వు తీసుకోవాల‌ని