hyderabadupdates.com movies మెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్

మెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్

విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. భారత ఏఐ రంగంలో ఇది ఒక చరిత్రాత్మక మలుపు అని, ఏఐ రంగానికి ప్రపంచ కేంద్రంగా భారత్ మారబోతోందని ఏఐ నిపుణులు చెబుతున్నారు. అమెరికా వెలుపల ఏఐ రంగంలో గూగుల్ పెట్టిన అతి భారీ పెట్టుబడి, అతి పెద్ద డేటా సెంటర్ ఇదే కాబోతోందని ఐటీ రంగం కోడై కూస్తోంది. అంతేకాదు, గూగుల్ తర్వాత మరెన్నో ప్రముఖ ఏఐ కంపెనీలు భారత్ వైపు రావడం ఖాయమని ఏపీ ప్రభుత్వం కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ క్రమంలోనే ఆ డేటా సెంటర్ క్రెడిట్ కొట్టేయాలని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూగుల్ డేటా సెంటర్ పై మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలోనే ఆ డేటా సెంటర్ కు బీజం పడిందని, అదానీకి కూటమి ప్రభుత్వం కనీసం థ్యాంక్స్ చెప్పలేదని అన్నారు. అయితే, తాజాగా జగన్ మరో అడుగు ముందుకు వేసి అసలు గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని వితండ వాదన చేస్తున్నారు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని చెప్పారు.

అంతేకాదు, గూగుల్ ను ఏపీకి తెచ్చేందుకు చంద్రబాబు చేసింది ఏముందని జగన్ అంటున్నారు. సింగపూర్ నుంచి కేబుల్స్ తెచ్చింది వైసీపీ అని, అదానీ–గూగుల్ మధ్య 2022లోనే నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందని చెబుతున్నారు. తమ హయాంలోనే ఇక్కడ భూములిచ్చామని, ఆ రోజు పడ్డ అడుగులు ఇప్పుడు గూగుల్ కు బాటలు వేశాయని అంటున్నారు. ఇలా మెల్లమెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే, జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడిన సంగతి ఆయన మరిచిపోయినట్లు కనిపిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్లే గూగుల్ తో పాటు ఇతర కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. క్రెడిట్ కొట్టేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీనే ఆయనకు ఆటోమేటిక్ గా క్రెడిట్ తెచ్చిపెడుతుందని అంటున్నారు.

Related Post

Thalaivar173: Did Dragon director Ashwath Marimuthu narrate a fun entertainer script to Rajinikanth?Thalaivar173: Did Dragon director Ashwath Marimuthu narrate a fun entertainer script to Rajinikanth?

Superstar Rajinikanth is currently filming for his next release, Jailer 2, directed by Nelson Dilipkumar. While the actor has announced his subsequent project, tentatively titled Thalaivar173, which will be produced

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని తక్కువ చేసి మాట్లాడడంతో పాటు, దీనిని నదీ గర్భంలో నిర్మిస్తున్నారని, దీని వెనుక మాఫియా ఉందని ఆయన ఆరోపించారు. అదే

Prashanth Neel Reveals His Inspiration – “Old Chiru Movies Made Me Fall in Love with Heroism”Prashanth Neel Reveals His Inspiration – “Old Chiru Movies Made Me Fall in Love with Heroism”

Bengaluru: KGF and Salaar director Prashanth Neel has opened up about the inspiration behind his powerful cinematic style. Known for his breathtaking elevation shots, grand hero entries, and strong emotional