hyderabadupdates.com movies మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్

మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్

మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్ post thumbnail image

మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్స్ మెస్సీని ఎంతో గౌరవంగా కలిస్తే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ చేసిన పని మాత్రం విమర్శల పాలవుతోంది. ఆమె ప్రవర్తించిన తీరు చూసి ఫుట్‌బాల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

వేదికపై మెస్సీ పక్కన నిల్చొని ఫోటోలు దిగేటప్పుడు అమృత నోట్లో చూయింగ్ గమ్ నములుతూ చాలా క్యాజువల్ గా కనిపించారు. ప్రపంచం మొత్తం ఆరాధించే ఒక స్టార్ పక్కన ఉండి, కనీస మర్యాద పాటించకుండా ఆమె ప్రవర్తించిన తీరు బాలేదని అంటున్నారు. అతిథికి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి, ఇదేం ఆటిట్యూడ్ అని నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు.

అంతటితో ఆగకుండా, సెల్ఫీ కోసం ఆమె చేసిన హడావిడి కూడా ట్రోల్స్ కు కారణమైంది. పక్కన ఉన్న అర్జెంటీనా ప్లేయర్ రోడ్రిగో డి పాల్ ను పక్కకు జరగమని సైగ చేసి మరీ, మెస్సీకి ఆనుకుని ఫోటోలు దిగడానికి ఆమె ప్రయత్నించారు. ఆ సమయంలో మెస్సీ కూడా కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా ఫీలవ్వడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ లో మెస్సీ పర్యటన ఎంతో పద్ధతిగా జరిగితే, ముంబైలో మాత్రం ఈ వీవీఐపీ కల్చర్ వల్ల పరువు పోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక రాష్ట్ర సీఎం భార్య హోదాలో ఉండి, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఇలా ప్రవర్తించడం మన సంస్కృతికే మచ్చ అని ఘాటుగా విమర్శిస్తున్నారు. కనీసం స్టేజ్ మీద ఉన్నప్పుడు చూయింగ్ గమ్ వేసుకోకూడదు అనే బేసిక్ మ్యానర్స్ కూడా లేవా అని నిలదీస్తున్నారు. మెస్సీ రాకతో దేశం మొత్తం సంబరపడితే, ఈ మూమెంట్ కాంట్రవర్సిగా మారింది. సెల్ఫీల మోజులో పడి విచక్షణ కోల్పోతే ఇలాగే ఉంటుందని మరికొందరు అంటున్నారు.

Amruta Fadnavis looking so irritating & ridiculous with that chewing gum and showing so much attitude while taking selfie twice. De Paul and Messi were literally laughing at her pic.twitter.com/nHAqDik2C5— sohom (@AwaaraHoon) December 14, 2025

Related Post

ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీనీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే బీహార్ ఎన్నికల కోసం తమ మొదటి అభ్యర్థుల లిస్ట్‌ను రిలీజ్ చేసి ఆశ్చర్యం కలిగించారు. ఎందుకంటే ఈ లిస్ట్‌లో మామూలు