hyderabadupdates.com movies మోహన్ బాబు కొత్త ఇన్నింగ్స్ ఎటువైపో

మోహన్ బాబు కొత్త ఇన్నింగ్స్ ఎటువైపో

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సమకాలీకుల్లాగా వేగంగా సినిమాలు చేయడం లేదు. వ్యక్తిగత కారణాలు, వ్యాపారాలు కారణాలు ఏమైనా ఆయన్ని రెగ్యులర్ గా స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్న మంచు అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. గత పదేళ్ల కాలంలో కొన్నింటిలో నటించారు కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు.

ప్రత్యేక పాత్రలు పోషించిన కన్నప్ప, శాకుంతలం నుంచి సోలో హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా, గాయత్రి ఏవీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే ఆయన తాజా లైనప్ చూస్తుంటే సరైన దర్శకులతో చేతులు కలిపినట్టు కనిపిస్తోంది. వాటిలో మొదటిది.. ముందుగా ఓకే చేసింది నాని ది ప్యారడైజ్.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పటిదాకా ఎవరూ చూపనంత వయొలెంట్ గా మోహన్ బాబు చూపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. కలెక్షన్ కింగ్ విలన్ గా చేయడం కొత్త కాదు. హీరోగా పీక్స్ లో ఉన్నప్పుడే ఎం ధర్మరాజు ఎంఏ లాంటి విలక్షణ చిత్రాలు చేసి మెప్పించారు. తొంభై దశకంలో వచ్చిన అల్లుడుగారు కన్నా ముందు ఆయన చేసిన క్యారెక్టర్స్ లో అధిక శాతం విలన్ షేడ్స్ ఉన్నవే.

ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తీస్తున్న శ్రీనివాస మంగాపురంలో చాలా పవర్ ఫుల్ రోల్ దక్కినట్టు వినికిడి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అదే అభిప్రాయం కలుగుతోంది. ఈ రెండు క్లిక్ అయితే మాత్రం ఆర్టిస్టుగా మోహన్ బాబు మళ్ళీ బిజీ అయిపోవచ్చు.

కాకపోతే పెద్దాయన్ని ఒప్పించడమే పెద్ద టాస్కట. శ్రీకాంత్, అజయ్ కన్విన్స్ చేయడం చూస్తే కంటెంట్స్ చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక అయన వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టుల్లో బిజీగానే ఉన్నారు.

భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన మనోజ్ కు మిరాయ్ రూపంలో మంచి హిట్ దొరికింది. డేవిడ్ రెడ్డి పెద్ద బడ్జెట్ తో రూపొందుతోంది. కన్నప్ప ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో విష్ణు ఈసారి కొత్త జానర్లు ట్రై చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్యారడైజ్, శ్రీనివాస మంగాపురం 2026లోనే విడుదల కాబోతున్నాయి కాబట్టి మంచు ఫ్యామిలీకి మెమరబుల్ ఇయర్ గా నిలుస్తుందేమో చూడాలి.

Related Post

మోడీకే క్రెడిట్.. భారత పాస్ పోర్టుకు పవర్ పెరిగిందిమోడీకే క్రెడిట్.. భారత పాస్ పోర్టుకు పవర్ పెరిగింది

ప్రపంచానికి పెద్దన్నగా.. సూపర్ పవర్ గా.. అగ్రరాజ్యంగా అమెరికాను అభివర్ణిస్తారు. అయితే.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్ పోర్టు ర్యాంకులో మాత్రం అగ్రరాజ్యం టాప్ స్థానంలో ఉండటం తర్వాత.. టాప్ 5లో కూడా ఉండని పరిస్థితి. ఇంతకూ పాస్ పోర్టు పవర్

ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌ఒలా ఇంజనీర్.. 28 పేజీల సూసైడ్ నోట్‌

బెంగళూరులో ఒలా ఎలక్ట్రిక్‌లో పనిచేస్తున్న కె. అరవింద్ (38) అనే ఇంజనీర్ ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అరవింద్ చనిపోయే ముందు రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, ఒలా ఫౌండర్ భావిష్ అగర్వాల్‌తో సహా తన ఉన్నతాధికారులు తనను