hyderabadupdates.com Gallery యుద్దం ప్ర‌భావం అమెరికా ఆర్మీ చీఫ్ కు మంగ‌ళం

యుద్దం ప్ర‌భావం అమెరికా ఆర్మీ చీఫ్ కు మంగ‌ళం

యుద్దం ప్ర‌భావం అమెరికా ఆర్మీ చీఫ్ కు మంగ‌ళం post thumbnail image

అమెరికా : ఇరాన్ పై యుద్దం కొన‌సాగుతున్న వేళ అమెరికా ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్భంగా యుఎస్ ఆర్మీ చీఫ్ కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఈ మేర‌కు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏకంగా దేశ అత్యున్న‌త సైనికాధిప‌తికి ఉద్వాస‌న ప‌లికారు దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్‌తో భీకర యుద్ధం నడుస్తున్న సమయంలో కారణం చెప్పకుండా ఓ సైన్యాధ్యక్షుడ్ని తొలగించారంటే అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్మీచీఫ్‌ స్థానంలో తమకు విధేయుడైన వ్యక్తి రాబోతున్నారు. అంటే గత సైన్యాధ్యక్షుడు అడ్డు చెప్పిన నిర్ణయాల్ని అమలు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలపై ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేకమంది ఉన్నతాధికారులను తొలగించారు. సైన్యంలో శరవేగంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే వచ్చే 2 వారాలు యుద్ధం మరింత తీవ్రం కాబోతోందని స్పష్టం అవుతోంది. ఇరాన్ యుద్ధ సంక్షోభం మధ్య ఆర్మీ చీఫ్‌ను తొలగించ‌డం చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పదవి నుంచి వైదొలగమని కోరడంతో, అమెరికా రక్షణ శాఖ ఆర్మీ చీఫ్ రాండీ జార్జ్‌ను తొలగించింది. ఈ చర్య అమల్లో ఉన్నంత వరకు క్రిస్టోఫర్ లానెవ్‌ను తాత్కాలిక చీఫ్‌గా నియమించారు. ఇదిలా ఉండ‌గా జనరల్ రాండీ ఎ. జార్జ్ 41వ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి తక్షణమే పదవీ విరమణ చేయనున్నారంటూ పెంట‌గాన్ ప్ర‌తినిధి సీన్ పార్నెల్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.
The post యుద్దం ప్ర‌భావం అమెరికా ఆర్మీ చీఫ్ కు మంగ‌ళం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అమెరికా నిర్ణ‌యం ఆక్వా రంగం బ‌లోపేతంఅమెరికా నిర్ణ‌యం ఆక్వా రంగం బ‌లోపేతం

అమ‌రావ‌తి : అమెరికా స‌ర్కార్ తాజాగా ప్ర‌క‌టించిన టారిఫ్ త‌గ్గింపుతో ఏపీలోని ఆక్వా రంగానికి మ‌రింత ఆస‌రా క‌ల్పించేందుకు దోహద ప‌డుతుంది. ఈ సంద‌ర్బంగా స్పందించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్

వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ కెరీర్‌లో ఇటీవల వచ్చిన వరుస వైఫల్యాలు ఆయనకు కొంత వెనుకడుగు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆయన పూర్తిగా కొత్త జోష్‌తో తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ “కొరియన్ కనకరాజు” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై