hyderabadupdates.com Gallery యువ‌త కృషి చేస్తే స‌క్సెస్ సాధ్యం : స‌త్య‌కుమార్

యువ‌త కృషి చేస్తే స‌క్సెస్ సాధ్యం : స‌త్య‌కుమార్

యువ‌త కృషి చేస్తే స‌క్సెస్ సాధ్యం : స‌త్య‌కుమార్ post thumbnail image

విజ‌య‌వాడ : యువత ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సహకారం చేసుకునే దిశగా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుడి జ‌యంతి సంద‌ర్బంగా ఆదివారం బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో మార‌థాన్ ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వివేకానంద విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం 5కె మార‌థాన్ ను జెండా ఊపి ప్రారంభించి ప్ర‌సంగించారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకే వెళ్లాల‌ని అన్నారు. క‌ష్ట‌ప‌డితే యువ‌త కొండ‌ల‌ను సైతం పిండి చేయ‌వ‌చ్చ‌ని అన్నారు.
ఈ దేశ నిర్మాణం జాతి నిర్మాణం చేయాలంటే యువత కీలకంగా వ్యవహరించాల‌ని పిలుపునిచ్చారు మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. అందుకు అణుగుణంగానే నేడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అంశాల్లో యువతను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టాయని చెప్పారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక యువతకు పెద్ద పీట వేస్తూ అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహిస్తూ రాణించేలా సహకారం అందిస్తున్నారని అన్నారు మంత్రి. యువత లో ఉన్న మేధోశక్తిని బయటకు తీస్తూ వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు స‌త్య కుమార్ యాద‌వ్. ప్రపంచ దేశాల్లో మన యువత ముందు ఉండేలా కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. యువత ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. కేంద్ర స‌ర్కార్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌లో కూడా యువ‌త‌కు వ‌ర్తింప చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని చెప్పారు.
The post యువ‌త కృషి చేస్తే స‌క్సెస్ సాధ్యం : స‌త్య‌కుమార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరిNara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి

    ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1.30 సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు

ఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎంఏపీ అగ్నిమాప‌క శాఖ దేశానికి రోల్ మాడ‌ల్ కావాలి : సీఎం

అమరావతి : దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్