hyderabadupdates.com movies యువ హీరోకోసం ఈసారైనా థియేటర్ కి వస్తారా?

యువ హీరోకోసం ఈసారైనా థియేటర్ కి వస్తారా?

సీనియర్ నటుడు ఆది సాయికుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి ఒకటిన్నర దశాబ్దం దాటిపోయింది. కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో అతను మంచి విజయాలే సాధించాడు. తర్వాత ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆది కెరీర్ తిరోగమనంలోనే పయనించింది. వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. అవకాశాలకు లోటు లేదు.

ఆది వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. తన సినిమాలు రిలీజవుతున్న విషయం కూడా జనాలు గుర్తించని పరిస్థితి వచ్చింది. తన సినిమాల కోసం జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయింది. చాలా సినిమాలు నామమాత్రంగానే రిలీజయ్యాయి. కానీ చిత్రమైన విషయం ఏంటంటే.. ఆది సినిమాలకు ఓటీటీల్లో మంచి ఆదరణే దక్కుతోంది. తన సినిమాలు కొన్ని నేరుగా ఓటీటీలోనే రిలీజయ్యాయి కూడా. వాటన్నింటికీ వ్యూస్ పరంగా ఢోకా లేదు.

స్టార్ హీరోల సినిమాలకు కూడా డిజిటల్ డీల్స్ జరక్క నిర్మాతలు ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఆది చిత్రాలకు మాత్రం ఆ సమస్య లేదు. తన స్థాయికి మంచి రేటే ఇచ్చి సినిమాలను కొంటూ వస్తున్నాయి ఓటీటీలు. ఇప్పుడు ఆది కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘శంబాల’ మూవీకి కూడా ఆల్రెడీ డిజిటల్ డీల్ పూర్తయింది. శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడైపోయాయి. రెంటికీ మంచి రేట్లే వచ్చాయట. 

ఈ రోజుల్లో ఇలా విడుదలకు కొన్ని వారాల ముందే డిజిటల్, శాటిలైట్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడవడం విశేషమే. ఐతే ఆన్ లైన్లో, టీవీల్లో ఆది సినిమాలకు ఎంత మంచి ఆదరణ దక్కినా.. థియేటర్లలో సినిమా హిట్టవడమే కీలకం. ఆ విషయంలో ఆది బాగా వెనుకబడిపోయాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ‘శంబాల’ రిలీజవుతోంది. దీని ప్రోమోలు ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. చాన్నాళ్ల తర్వాత ఆది సినిమా చూడ్డానికి జనాలు థియేటర్లకు రావడానికి స్కోప్ ఉన్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. మరి ఈసారైనా అతను కంటెంట్‌తో మెప్పించి బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొడతాడేమో చూడాలి.

Related Post

చైతు లవ్ స్టోరీకి సరైన సమయంచైతు లవ్ స్టోరీకి సరైన సమయం

నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయిన లవ్ స్టోరీని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. 2021లో విడుదలయ్యాక మళ్ళీ దీన్ని థియేటర్లకు తీసుకురాలేదు. అయిదు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులకు మరోసారి చూపించబోతున్నారు. అయితే

దీపావళికి లీడ్ తీసుకునేదెవరు?దీపావళికి లీడ్ తీసుకునేదెవరు?

కొన్ని నెలలుగా డల్లుగా సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సెప్టెంబరులో మంచి ఊపే వచ్చింది. అక్టోబరులోనూ ‘కాంతార: చాప్టర్-1’తో మంచి ఆరంభమే దక్కింది. ఈ వారం ‘శశివదనే’ సహా కొన్ని చిన్న సినిమాలు వస్తున్నాయి. వాటికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఆ తర్వాతి వారం బాక్సాఫీస్

శృతి హాసన్ మిస్ చేసిన జూలియట్శృతి హాసన్ మిస్ చేసిన జూలియట్

ఇప్పుడున్న పరిస్థితుల్లో పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలు హీరోయిన్లకు దక్కడం చాలా అరుదైపోయింది. రష్మిక మందన్నకు గర్ల్ ఫ్రెండ్ దొరికినట్టు అందరికీ అలాంటి ఛాన్సులు రావడం లేదు. శ్రీలీలనే తీసుకుంటే అందంతో పాటు టాలెంట్ ఉన్నప్పటికీ దాన్ని వాడుకునే దిశగా దర్శకులు