hyderabadupdates.com movies రవితేజను అవమానించిన నిర్మాత ఎవరు?

రవితేజను అవమానించిన నిర్మాత ఎవరు?

సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా చిన్న స్థాయిలో పని చేసిన వాళ్లు.. తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంటారు. కానీ ఈ లోపు వారికి అనేక అవమానాలు ఎదురవడమూ సహజమే. ఒక స్థాయికి ఎదిగాక చాలామంది తమకు ఎదురైన ఇబ్బందులు, అవమానాల గురించి వెల్లడిస్తుంటారు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా, చిన్న స్థాయి నటుడిగా కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న రవితేజ.. తర్వాత హీరోగా మారి ఎంత పెద్ద స్థాయికి ఎదిగాడో తెలిసిందే. కానీ ఎప్పుడూ తన కష్టాల గురించి చెప్పుకుననది లేదు. ఎవరి మీదా కౌంటర్లు వేసింది కూడా లేదు. కానీ రవితేజను ఒక నిర్మాత అవమానించిన వైనం గురించి సీనియర్ రైటర్ కోన వెంకట్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర స్టోరీ బయటపెట్టాడు.

ఒక సినిమా షూటింగ్ టైంలో రవితేజ భోజనం చేయడానికి వెళ్తే.. అడ్డమైన వాళ్లంతా తినడానికి వచ్చేస్తారంటూ ఒక పేరున్న నిర్మాత తన ముందే అవమానకరంగా మాట్లాడాడని కోన వెంకట్ వెల్లడించాడు. ఐతే మాస్ రాజా స్టార్ హీరోగా ఎదిగి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా చేస్తున్న సమయంలో అదే నిర్మాత రవితేజ కారవాన్ దగ్గరికి వచ్చి తనతో సినిమా చేయడం కోసం తచ్చాడుతూ కనిపించాడని కోన వెంకట్ తెలిపాడు.

ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్మాతకు అవకాశం ఇవ్వొద్దు అని తాను పట్టుబడితే.. ఆ నిర్మాత బేనర్లో సినిమా చేసి హిట్టు కొట్టడమే అసలైన సక్సెస్ అంటూ రవితేజ మాట్లాడాడంటూ బయటపెట్టాడు కోన వెంకట్. రవితేజ గొప్పదనానికి ఇంతకంటే రుజువేముంటుందని కోన వెంకట్ చెప్పగా.. మాస్ రాజా ఫ్యాన్స్‌ను ఈ వీడియో ఉద్వేగానికి గురి చేస్తోంది. కోన వెంకట్ నిర్మాతగా తెరకెక్కిన ‘బ్యాండ్ మేళం’ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించాడు.

Related Post

Win Tickets to Our ‘Springsteen: Deliver Me from Nowhere’ IMAX Screening
Win Tickets to Our ‘Springsteen: Deliver Me from Nowhere’ IMAX Screening

Collider is excited to announce that we’ve partnered with 20th Century Studios and IMAX to offer our readers a chance to see writer-director Scott Cooper’s (Crazy Heart) biographical drama, Springsteen: