hyderabadupdates.com movies రవితేజ మార్కు రైల్వే ‘మాస్’

రవితేజ మార్కు రైల్వే ‘మాస్’

మాస్ మహారాజా రవితేజని వింటేజ్ పాత్రలో చూసి చాలా రోజులయ్యింది. ఒకరిద్దరు దర్శకులు ఆ దిశగా ప్రయత్నాలు చేద్దామని సినిమాలు తీశారు కానీ అవి ఆడియన్స్ అంచనాలు అందుకోలేక నిరాశ పరిచాయి. సోలో హీరోగా ధమాకా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బొమ్మే కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ కోరికకు అనుగుణంగా రూపొందిన మాస్ జాతర అక్టోబర్ 31 సాయంత్రం షోల నుంచి విడుదలకు రెడీ అవుతోంది. స్టార్ రైటర్ భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు హీరోయిన్ శ్రీలీల, భీమ్స్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానున్నాయి.

స్టోరీని దాచలేదు. సింగల్ పాయింట్ లో చెప్పేశారు. రైల్వే పోలీస్ గా పని చేసే లక్ష్మణ్ భేరి (రవితేజ) కు అన్యాయమంటే ఒళ్ళు మంట. స్మగ్లింగ్ తో ఆ ప్రాంతాన్ని చెప్పు చేతల్లో పెట్టుకున్న ఓ మాఫియా లీడర్ (నవీన్ చంద్ర) తో కోరి శత్రుత్వం తెచ్చుకుంటాడు. పెంచి పెద్ద చేసిన తాత (రాజేంద్రప్రసాద్), ఇష్టపడిన ప్రియురాలు (శ్రీలీల) ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న లక్ష్మణ్ లైఫ్ లోకి అనుకున్నట్టే ప్రమాదాలు వచ్చి పడతాయి. లైఫ్ ని రిస్క్ లో పెట్టుకుని వాటికి ఎదురు వెళ్తాడు. ఇంతకీ రైల్వే పోలీస్ ఇంత పెద్ద నేర సామ్రాజ్యాన్ని మట్టుబెట్టేందుకు ఎందుకు పూనుకున్నాడనేది తెరమీద చూడాలి.

విజువల్స్ చూస్తుంటే అభిమానులకు ఫుల్ మీల్స్ లాగే ఉంది. కాకపోతే కథ రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండటం, కమర్షియల్ మీటర్ కు అనుగుణంగా భాను భోగవరపు అన్ని అంశాలు మేళవించడంతో కామన్ ఆడియన్స్ కి ఎంత స్థాయిలో కనెక్ట్ అవుతాయో చూడాలి. ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ తో పెద్దగా పని ఉండదు కానీ కంటెంట్ కనక మాస్ మెచ్చుకునేలా ఉంటే బ్లాక్ బస్టర్ ఖాయం. ఆ వైబ్స్ అయితే ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విక్రమార్కుడు పోలీస్ డ్రెస్సుకి కిక్ స్టైల్ లో వినోదాన్ని జోడించి ఈ మాస్ జాతరని రూపొందించినట్టు కనిపిస్తోంది. అక్టోబర్ నెలను రవితేజ ఎంత పెద్ద సక్సెస్ తో ముగిస్తాడో చూడాలి.

Related Post

`అయోధ్య`లో చంద్ర‌బాబు`అయోధ్య`లో చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఈ ఏడాదిలో తొలిసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ఖ్యాత అయోధ్య రామ‌జ‌న్మ‌భూమిని సంద‌ర్శించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ నుంచి ల‌క్నో చేరుకున్న ఆయ‌న‌.. అయోధ్యకు వెళ్లి బాల రామ‌య్య ఆల‌యంలో శ్రీరాముడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌జ‌న్మ‌భూమి

అమ‌రావ‌తికి కీల‌క సంస్థ‌… జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గాల్సిందే!అమ‌రావ‌తికి కీల‌క సంస్థ‌… జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గాల్సిందే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావతి విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే త‌న నిర్ణ‌య‌మే క‌రెక్ట్ అన్న ధోర‌ణితో ఉన్నారు. ఈ విష‌యం ఇటీవల ఆయ‌న మీడియాతో మాట్లాడిన‌ప్పుడు కూడా స్ప‌ష్ట‌మైంది. నిజానికి కాలం మారుతోంది. ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణులు కూడా మారుతున్నాయి.