hyderabadupdates.com movies రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రవితేజ. ఆయన అప్పుడప్పుడూ క్లాస్ మూవీస్, ప్రయోగాత్మక కథలు చేస్తుంటాడు కానీ.. మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాక ఇలాంటి ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం మాత్రం అరుదు. వరుస ఫ్లాపుల నేపథ్యంలో రూటు మార్చి సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సూటయ్యే సినిమా చేసినట్లున్నాడు రవితేజ. 

నిన్న రిలీజైన ట్రైలర్ చూస్తే.. అది ఆరంభమైన తీరుతోనే అందరూ ఆశ్చర్యపోయారు. ‘‘ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు.. కత్తులు.. భోజనాల ఫైట్.. జాతర ఫైట్.. ఓ తెగ చేసేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు’’ అంటూ తాను ఎందుకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి ఫ్యామిలీ మూవీ చేయాల్సి వచ్చిందో తన గత చిత్రాల రెఫరెన్సులు పెట్టి చెప్పకనే చెప్పాడు రవితేజ.

సోషల్ మీడియాలో పాపులర్ అయిన విషయాలతో.. అలాగే ఫిలిం సెలబ్రెటీల పాపులర్ డైలాగులతో పంచులు వేయడం ఇప్పుడు ట్రెండు. దర్శకుడు కిషోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ఆ ప్రయత్నం కొంచెం గట్టిగానే చేసినట్లున్నాడు. రవితేజ డైలాగ్ తర్వాత సత్య.. ‘‘రెడీ బాబు’’ అనడం బోయపాటి శైలిని అనుకరించడమే.

తర్వాత ఇదే సత్య.. ‘‘నీకేమన్నా అయితే మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్ నేనే మేడం’’ అంటూ ‘అర్జున్ రెడ్డి’లో పాపులర్ అయిన విజయ్ దేవరకొండ డైలాగును తన మాడ్యులేషన్‌లోనే చెప్పడం విశేషం. అంతే కాక ‘ఎవడు సార్ ఈ దురంధర్’ అంటూ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా పేరును కూడా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో వాడేయడం విశేషం.

ఇవన్నీ ఒకెత్తయితే.. చక్కెర తీసుకెళ్లి జనరేటర్లో పోసే ఒక షాట్ చూపించారు ట్రైలర్లో. ఇది చూడగానే మంచు ఫ్యామిలీ గొడవ గుర్తుకు వస్తోంది అందరికీ. గత ఏడాది మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవ పీక్స్‌లో ఉండగా.. మంచు విష్ణు తన ఇంటికి అనుచరులతో వచ్చి జనరేటర్లో చక్కెర పోసి పవర్ సిస్టమ్ అంతా దెబ్బ తీసేలా చేశాడని మనోజ్ ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

దీని మీద అతను వెళ్లి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మంచు బ్రదర్స్ గొడవ సద్దుమణిగిన టైంలో జనరేటర్లో చక్కెర పోసే సీన్ పెట్టడం అంటే మంచు ఫ్యామిలీని గిచ్చడమే. ఇంతకుముందు ‘సింగిల్’ సినిమాలో ఇలాగే తన మీద, తన ఫ్యామిలీ మీద పంచ్ వేస్తే మంచు విష్ణు ఊరుకోలేదు. దీంతో సంబంధిత సన్నివేశాలను చిత్ర బృందం తీసేసింది. మరి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మంచు ఫ్యామిలీ రెఫరెర్సులపై ఆ ఫ్యామిలీ వాళ్లు ఏమైనా అభ్యంతర పెడతారా.. ఈ సీన్ తీసేయాల్సిన పరిస్థితి వస్తుందా.. లేక దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలి.

Related Post

Joju George starrer Chola movie actor Akhil Vishwanath passes away at 30Joju George starrer Chola movie actor Akhil Vishwanath passes away at 30

Chola, which was produced by Joju George, is a psychological thriller directed by Sanal Kumar Sasidharan. The film was screened at several international venues, including the Venice International Film Festival,