hyderabadupdates.com movies రవితేజ స్టామినాకు అసలు పరీక్ష

రవితేజ స్టామినాకు అసలు పరీక్ష

రేపు సాయంత్రం నుంచి మాస్ జాతర ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. రవితేజ సినిమా విడుదలవుతోందంటే ఓ రేంజ్ హడావిడి కనిపించాలి. కానీ ఇప్పటికైతే ఆ స్థాయి సౌండ్ సోషల్ మీడియాలో వినిపించడం లేదు. ఒక పక్క తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న తుఫాను, ఇంకోవైపు బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ హంగామా వెరసి మాస్ రాజా మూవీ మీద పెద్ద ప్రభావమే చూపిస్తున్నాయి. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ మిగిలిన ప్రాంతాల్లో మాస్ జాతర హడావిడి ఆశించిన స్థాయిలో లేదు. ప్రమోషన్ల పరంగా టీమ్ చేసుకున్న ప్లానింగ్ మరీ గొప్ప ఫలితాలు ఇవ్వలేదన్నది వాస్తవం.

ఒకరకంగా చెప్పాలంటే రవితేజ స్టామినాకి ఇది అగ్ని పరీక్షే. ఎందుకంటే చేసింది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనరే అయినా మాస్ జనాలు కన్విన్స్ అయ్యేలా కంటెంట్ ఉంటే ఈజీగా హిట్టు కొట్టొచ్చు. దానికి ధమాకానే మంచి ఉదాహరణ. ఆ సినిమాకు సంగీతం అందించిన భీమ్సే ఇప్పుడీ మాస్ జాతరకు పని చేసినప్పటికీ ఆ స్థాయి వైరల్ సాంగ్స్ ఇవ్వలేకపోవడం మైనస్ గా నిలిచింది. ట్రైలర్ కొచ్చిన రెస్పాన్స్ కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది తప్ప వావ్ కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా రవితేజనే గతంలో చిరాకు కలిగించాను, ఇది పక్కా హిట్టని హామీ ఇవ్వడం ఫ్యాన్స్ నమ్మకం పెరిగేలా చేసింది.

ఇక అసలైన టైం వచ్చేసింది. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచే మాస్ జాతర షోలు మొదలైపోతాయి. టాక్ చాలా కీలకం కానుంది. జస్ట్ యావరేజ్ అనిపించుకున్నా రికవరీ చేయడం రవితేజకు మంచి నీళ్లు తాగినంత ఈజీ. లేదూ హిట్టు అనిపించుకుంటే కనీసం రెండు వారాలు మంచి ర్యాంపేజ్ ఉంటుంది. లిటిల్ హార్ట్స్, కిష్కిందపురి, మిరాయ్, ఓజి, కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ తో సెప్టెంబర్, అక్టోబర్ నెలలు కళకళలాడాయి. మరి ఈ మంత్ ఎండ్ ని రవితేజ హిట్టుతో ముగిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఈ సస్పెన్స్ ఇంకో ముప్పై గంటల తర్వాత వీడిపోతుంది. మాస్ రాజా గెలిచాడో లేదో తేలిపోతుంది.

Related Post

మూర్తీభవించిన సేవాగుణం సత్యసాయి శతజయంతిమూర్తీభవించిన సేవాగుణం సత్యసాయి శతజయంతి

మూర్తీభవించిన మానవత్వానికి ప్రతీకగా నిలిచిన సత్యసాయి గురించి అన్నీ తెలియకపోయినా కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి. నేడు నవంబర్ 19 ఆయన శతజయంతి. ఈ సందర్బంగా పుట్టపర్తిలోని సత్యసాయి నిలయాల్లో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి నుంచి ఉపరాష్ట్రపతి వరకు

Akash Jagannadh Launches the Melodious Title Song of ‘Vasudeva Sutham’Akash Jagannadh Launches the Melodious Title Song of ‘Vasudeva Sutham’

The much-awaited title song from the upcoming film Vasudeva Sutham has been officially launched by young hero Akash Jagannadh. The movie stars Master Mahendran in the lead role and is