hyderabadupdates.com movies రాకా – ఇది ఊహించలేదు కాకా

రాకా – ఇది ఊహించలేదు కాకా

అత్యంత క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ముందు వరసలో ఉన్న అల్లు అర్జున్ – అట్లీ కాంబో మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. టైటిల్ దగ్గరి నుంచి స్టోరీ లైన్ వరకు ప్రతిదీ గోప్యంగా ఉంచడంలో సన్ పిక్చర్స్ టీమ్ సక్సెస్ అయ్యింది. అసలు లీక్ అనేదే లేకుండా మైంటైన్ చేసిన విధానం ప్రేక్షకుల్లో ఎగ్జైట్ మెంట్ పెంచింది. ఇవాళ బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ తో పాటు ప్రీ లుక్ లాంటి ఫస్ట్ లుక్ ఒకటి విడుదల చేశారు.

నిజంగానే షాక్ ఇచ్చేలా ఎవరూ ఊహించని ట్విస్టు ఇచ్చాడు దర్శకుడు అట్లీ. చేతికి జంతువును పోలిన పదునైన గోళ్లతో తలమీద పూర్తి జుత్తు ఉందా లేదాని అనుమానం వచ్చేలా సెట్ చేసిన హెయిర్ స్టైల్ తో అల్లు అర్జున్ షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఫేస్ మొత్తాన్ని రివీల్ చేయకపోయినా రాబోయే రోజుల్లో దీని మీద అంచనాలు అమాంతం పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. రాకా అనే టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా, ఇండస్ట్రీలో చర్చించుకునేలా ఉంది.

సో పుష్పలో గంగమ్మ గెటప్ తర్వాత మరో టెర్రిఫిక్ మేకోవర్ తో అల్లు అర్జున్ ఆడియన్స్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. దీన్ని బట్టి బన్నీ రాకాలో డ్యూయల్ రోల్ లేదా అంతకన్నా ఎక్కువ పాత్రలు పోషించడం కన్ఫర్మ్ అయినట్టే. ఫాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే రాకాకు సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నాడు. దీపికా కాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న పేర్లు హీరోయిన్లుగా ప్రచారంలో ఉన్నాయి కానీ టీమ్ ఇంకా అఫీషియల్ చేయలేదు.

ఇక విడుదల విషయానికి వస్తే దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. షూటింగ్ ఎప్పుడు పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ కోసం చాలా ఎక్కువ సమయం అవసరమవుతుంది కాబట్టి అవన్నీ చూసుకున్నాక రిలీజ్ డేట్ గురించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఈ సంవత్సరం ఛాన్స్ లేదు కానీ 2027లో ఎప్పుడు ఉండొచ్చనేది తేలడానికి కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. దీపీకా పదుకునే మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాకు పలు హాలీవుడ్ కంపెనీలు పని చేస్తున్నాయి.

Related Post

“Band Melam to Strike Big?”: Sree Vishnu’s Confident Boost Before Release“Band Melam to Strike Big?”: Sree Vishnu’s Confident Boost Before Release

The upcoming Telugu film Band Melam is generating strong buzz ahead of its theatrical release on March 26, with several prominent film personalities expressing confidence that the film will emerge