hyderabadupdates.com movies రాకెట్ బాణంతో రాజా సింగ్… జస్ట్ మిస్

రాకెట్ బాణంతో రాజా సింగ్… జస్ట్ మిస్

రాజా సింగ్… ఈ పేరు వింటేనే ఒక రకమైన భావన కలుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న ఈ మాజీ బీజేపీ నేత ఏం చేసినా సంచలనంగానే మారుతుంది. తాను చేసిన పనుల వల్ల బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సింగ్… నిత్యం వార్తల్లో ఉండేలా రకరకాల ఫీట్లు చేస్తుంటారు. తాజాగా శ్రీరామ నవమి నాడు ఏకంగా దీపావళి వేడుకలకు యత్నించిన ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

నవమి నాడు రాజా సింగ్ దీపావళి వేడుకలు, ఆ సందర్భంగా జరిగిన చిన్నపాటి ప్రమాదం తదితరాలకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో రాజా సింగ్ పూర్తిగా అలంకరించిన ఓ వాహన  రధంపై ఎక్కి కూర్చున్నారు. రథంతో పాటు తాను నిండా అలంకరణలతోనే కనిపించారు. చేతిలో విల్లు, బాణాన్ని పట్టుకున్నారు. ఇక తన చేతిలోని విల్లంబులకు ఆయన టపాసులను అమర్చుకున్నారు.

ఇలా టపాసులను కట్టిన విల్లును ఎక్కు పెట్టిన రాజా సింగ్… విల్లు నుంచి బాణం విడుస్తున్నట్లుగా కనిపించారు. ఈ క్రమంలో విల్లులోని టపాసులు పేల్చిన కర్రను ఆయన సరిచేసే యత్నం చేశారు. ఈ సందర్భంలో విల్లుకు ఉన్న టాపాసులు ఒక్కసారిగా పేలాయి.

ఈ పేలుడు దూరం నుంచి వచ్చి పడ్డ టపాసులు పేలినట్లుగా కనిపించింది. ఉన్నపళంగా టపాసులు పేటడంతో ఆ పేలిన రవ్వలు సింగ్ ముఖం మీద పడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో రాజా సింగ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు రాజా సింగ్ ను ప్రోత్సహిస్తూ కామెంట్లు పెడితే… మెజారిటీ నెటిజన్లు ఇదే పోయే కాలమన్నట్లుగా ఆసక్తికర కామెంట్లు సంధిస్తున్నారు.

Related Post

Naga Vamsi slams audiences: ‘If Lokah was a straight Telugu movie, no one would watch it’Naga Vamsi slams audiences: ‘If Lokah was a straight Telugu movie, no one would watch it’

Producer Naga Vamsi recently criticized the audience for their lack of appreciation for Telugu cinema. In an interview ahead of the release of Ravi Teja’s Mass Jathara, the filmmaker commented