hyderabadupdates.com movies రాజమౌళి తీరిగ్గా బ్రేక్ తీసుకున్నారంటే..?

రాజమౌళి తీరిగ్గా బ్రేక్ తీసుకున్నారంటే..?

దర్శకధీరుడు రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. సినిమా మొదలుపెడితే అది పూర్తయ్యే వరకు ఆయన వేరే లోకాన్ని చూడరు. హీరోలకు చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా సెట్ లోనే బంధించేస్తుంటారు. ‘మర్యాదరామన్న’ లాంటి చిన్న సినిమాకే ఏడాదికి పైగా సమయం తీసుకున్న జక్కన్న, ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ సినిమా విషయంలో తన పాత పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. షూటింగ్ మధ్యలో ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు ఒక లీక్ రాగానే అందరూ షాక్ అవుతున్నారు.

సాధారణంగా రాజమౌళి ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాతే రిలాక్స్ అవుతారు. కానీ మహేష్ బాబుతో చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసి విషయంలో రూటు మార్చారు. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ చకచకా పూర్తి చేసేశారంటే, పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2027 సమ్మర్ కు సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తానని గతంలోనే మాట ఇచ్చారు. అనుకున్న సమయానికంటే ముందే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు తీరిగ్గా బ్రేక్ తీసుకుని రీఛార్జ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని శంకరపల్లిలో వారణాసి నేపథ్యంలో సాగే ఒక కీలక షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో మహేష్ బాబుతో పాటు ఫృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే చిత్ర బృందం ఒక చిన్న బ్రేక్ తీసుకోబోతోంది. రాజమౌళి తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్తుండగా, మహేష్ బాబు కూడా విదేశాలకు పయనం కానున్నారు. ఇలా హీరోని కూడా వదిలేశారంటే, ప్లానింగ్ విషయంలో రాజమౌళి ఎంత పక్కాగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

జక్కన్న పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ తో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అంటే ప్రతి సీన్, ప్రతి విజువల్ ముందే పేపర్ మీద లాక్ అయిపోయాయి. అందుకే హాలీవుడ్ రేంజ్ లో సాగే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ షూటింగ్ ఎక్కడా తడబాటు లేకుండా సాగిపోతోంది. గతంలో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం నెలల తరబడి సమయం తీసుకున్న ఆయన, ఈసారి షూటింగ్ తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా నడిపిస్తున్నట్లు సమాచారం. అందుకే రిలీజ్ కు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఆయన ఇంత కూల్ గా కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ గురించి అప్పుడే రకరకాల చర్చలు మొదలయ్యాయి. వారణాసి లాంటి ఆధ్యాత్మిక నగరంలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. శంకరపల్లిలో వేసిన ఆ సెట్ విజువల్స్ అచ్చం గంగా ఘాట్లను తలపిస్తున్నాయట. మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని ఒక కొత్త మేకోవర్ లో చూపించబోతున్నారు. పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ను జోడించి అడ్వెంచర్ జోనర్ లో ఈ కథను నడిపిస్తుండటంతో, విదేశీ లొకేషన్లు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తారేమో చూడాలి.

Related Post

Diés Iraé Online Release: When and where to watch Pranav Mohanlal’s horror flick on OTTDiés Iraé Online Release: When and where to watch Pranav Mohanlal’s horror flick on OTT

The film follows Pranav Mohanlal’s character Rohan, a wealthy Indian-American architect living comfortably in a Kerala villa. After hearing about the passing of his former classmate Kani, played by Sushmita

దృశ్యం 3 మీద సన్నగిల్లుతున్న ఆశలుదృశ్యం 3 మీద సన్నగిల్లుతున్న ఆశలు

ఫ్యామిలీ థ్రిల్లర్స్ లో కొత్త ఒరవడికి చుట్టిన దృశ్యం ఫ్రాంచైజ్ లో చివరి భాగం మలయాళంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. మోహన్ లాల్ సహకారంతో జీతూ జోసెఫ్ చకచకా గుమ్మడికాయ కొట్టేశారు. వేసవి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. డిస్ట్రిబ్యూటర్లతో అగ్రిమెంట్లు కూడా