hyderabadupdates.com movies రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు నుంచి కోరుకుంటున్నారు. 2010 ప్రాంతంలోనే సాధ్యం కావాల్సిన ఈ కాంబినేషన్ ఎట్టకేలకు రెండేళ్ల ముందు ముందుకు కదిలింది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై పాన్ వరల్డ్ లెవెల్లో భారీ అంచనాలున్నాయి.

మహేష్, రాజమౌళి చాలా ఆలస్యంగా కలిసినా.. ఈ ఆలస్యం కూడా మంచికే అనుకుంటున్నారు అభిమానులు. ఐతే రెండేళ్లుగా ఈ ఇద్దరూ మంచి అండర్‌స్టాండింగ్‌తో సాగిపోతున్నారు. అలాంటి ఇద్దరూ బీభత్సంగా కొట్టేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ కొంటె ఆలోచనతోనే ఏఐ సాయంతో తయారు చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజమౌళి ప్రెజెంట్ లుక్‌, మహేష్ ‘వారణాసి’ రుద్ర లుక్‌లో ఉండి.. ఒక కాఫీ షాప్ లాంటి ప్లేసు‌లో ఒకరినొకరు చితగ్గొట్టేసుకుంటున్నారు ఈ వీడియోలో. ఒకరి దెబ్బలకు ఇంకొకరు ఎగిరి పడి కుర్చీలు, టేబుళ్లు విరిగిపోవడం.. చుట్టూ ఉన్న వాళ్లు చూసి అవాక్కవ్వడం.. ఇలా సాగింది వీడియో. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతికి చిక్కింది.

ఎక్స్‌లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆర్జీవీ.. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘సినిమా ఈజ్ డెడ్’ అని క్యాప్షన్ కూడా జోడించాడు. మామూలుగానే వర్మ ఏ వీడియో పంచుకున్నా వైరల్ అవుతుంది. అలాంటిది రాజమౌళి, మహేష్ బాబులు ఒకరినొకరు చితగ్గొట్టేసుకుంటున్నట్లుగా రూపొందించిన వీడియో కావడంతో ఇది మరింతగా వైరల్ అవుతోంది. ఈ పాటికే ఈ వీడియో రాజమౌళి, మహేష్ బాబుల దృష్టిలో పడి ఉన్నా.. రేప్పొద్దున ఈ ఇద్దరూ దాని మీద స్పందించినా ఆశ్చర్యం లేదేమో.

CINEMA IS DEAD https://t.co/JUPhPHPTDz— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2026

Related Post

Jaat 2: Possible change of director for Sunny Deol’s sequelJaat 2: Possible change of director for Sunny Deol’s sequel

Bollywood action superstar Sunny Deol’s recent outing Jaat, helmed by Tollywood director Gopichand Malineni, performed decently at the box office. The full-blown action entertainer showcased Sunny Deol at his absolute

వైసీపీకి మంత్రి లోకేష్ బిగ్ ఆఫర్!వైసీపీకి మంత్రి లోకేష్ బిగ్ ఆఫర్!

నిజమే! టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. నిరంతరం రాజకీయ యుద్ధం చేసే ప్రతిపక్షం వైసీపీకి ఆయన బిగ్ ఆఫర్ ఇచ్చారు. తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడిన లోకేష్ పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కూటమి