hyderabadupdates.com movies రాజమౌళి ‘వారణాసి’ వెనుక కనిపించని కోణం

రాజమౌళి ‘వారణాసి’ వెనుక కనిపించని కోణం

వారణాసి టైటిల్ మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఆల్రెడీ ఈ పేరుని వేరొక నిర్మాణ సంస్థ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయడంతో దీన్ని ఇండస్ట్రీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారనే దాని మీద అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదంతా ముందే ఊహించిన రాజమౌళి ట్రైలర్ చివరిలో రాజమౌళి వారణాసి అని వేసుకోవడం ఆషామాషీగా తీసుకునే చిన్న మ్యాటర్ కాదు. గతంలో ఖలేజాకు ఇదే సమస్య వచ్చినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలివిగా టైటిల్ ముందు మహేష్ పేరు పెట్టి పని కానిచ్చేశారు. టెక్నికల్ గా అలాగే పిలవాలి. కానీ జనంలోకి వెళ్ళాక అది ఖలేజాగానే పాపులరయ్యింది. దీంతో రిజిస్టర్ చేసుకున్న వేరే ప్రొడ్యూసర్ సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు వారణాసికీ అదే చేసినట్టు స్పష్టమవుతోంది. ఇక్కడ అభిమానులు ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు. వారణాసి ముందు రాజమౌళి పేరు ఎందుకు, మహేష్ బాబు అని పెట్టొచ్చు కదాని అడుగుతున్నారు. నిజమే, అడగడం సబబే. కానీ ఇక్కడో ఓపెన్ లాజిక్ మర్చిపోకూడదు. ఆర్ఆర్ఆర్ వల్ల రాజమౌళి పేరు గ్లోబల్ స్టేజికి చేరిపోయింది. ఆస్కార్ దాకా వెళ్ళింది. జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్ లకు సైతం జక్కన్న అంటే ఎవరో తెలుసు, జపాన్, చైనా లాంటి దేశాలకు బాహుబలి వెళ్ళడానికి కారణం ప్రభాస్ కాదు. ముమ్మాటికీ రాజమౌళినే. సో ఆ బ్రాండింగ్ అంత బలంగా వివిధ దేశాల్లో పాతుకుపోయింది.

మహేష్ బాబు మన దగ్గర ఎంత సూపర్ స్టార్ అయినా వారణాసినే తన మొదటి ప్యాన్ వరల్డ్ మూవీ. ఈ పేరు మీద ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేయడం ఇబ్బందే. ఇలా చెబితే ఫ్యాన్స్ కి కొంచెం కోపం రావొచ్చు కానీ వారణాసి బ్లాక్ బస్టర్ అయ్యాక అప్పుడు ఏ దర్శకుడైనా మహేష్ పేరు మీదే మార్కెటింగ్ చేసుకుంటాడు. సో వారణాసి విషయంలో కొంచెం చూసుకుని పోవాల్సిందే. అయినా హీరో దర్శకుడి మధ్య ముందే ఇదంతా చర్చకు రాకుండా నిర్ణయాలు తీసుకుని ఉంటారని అనుకోవడానికి లేదు. అన్ని కోణాల్లో విశ్లేషించుకునే ఫైనల్ గా టైటిల్ ఫిక్స్ చేసి ఉంటారు. సో ఫ్యాన్స్ ప్రశాంతంగా రిలాక్స్ అవ్వొచ్చు.

Related Post