hyderabadupdates.com movies రాజా సాబ్ రాకలో ఆలస్యం లేదు

రాజా సాబ్ రాకలో ఆలస్యం లేదు

ఇంకో రెండు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ది రాజా సాబ్ చెప్పిన డేట్ కి వస్తుందా రాదానే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా తిరిగింది. కొన్ని హ్యాండిల్స్ ఏకంగా వాయిదా ప్రచారం చేయడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన ఇచ్చింది. జనవరి 9 రాజా సాబ్ రాకలో ఎలాంటి మార్పు లేదని, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, పుకార్లు ఏవీ నమ్మొద్దని ఒక సుదీర్ఘమైన నోట్ విడుదల చేసింది. త్వరలో స్పిరిట్ షూటింగ్ మొదలుకాబోతున్న నేపథ్యంలో రాజా సాబ్ కు సంబంధించి ప్రభాస్ పనులన్నీ ఈ నెలలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.

అందుకే స్పీడ్ పెంచారు. మారుతీ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ డ్రామాకు సంబంధించి ప్రధాన ఆర్టిస్టుల డబ్బింగ్ దాదాపుగా పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ ఒకటే పెండింగ్ ఉందట. తమన్ అఖండ 2 వర్క్ పూర్తి కాగానే రాజా సాబ్ రీ రికార్డింగ్ మొదలుపపెట్టాలి. కంటెంట్ మాములుది కాదు కాబట్టి ఈసారి ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇంతకీ పాటలు ఎలా ఉంటాయనే సస్పెన్స్ ఇంకా తొలగిపోలేదు. మొదటి ఆడియో సింగల్ ఎప్పుడెప్పుడాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో రిలీజయ్యే పెద్ది అప్డేట్స్ వచ్చాయి కానీ రాజా సాబ్ వి లేట్ కావడం మీద అభిమానులు అసహనంగా ఉన్నారు.

సంక్రాంతి పోటీ ఎంత ఉన్నప్పటికీ రాజా సాబ్ మీద నిర్మాతలకున్న ధీమా వేరే లెవెల్ లో ఉంది. మరో వెయ్యి కోట్ల గ్రాసర్ ఖాయమనే నమ్మకంతో బయ్యర్లున్నారు. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, జన నాయకుడు, పరాశక్తి ఇలా పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాజా సాబ్ రెవిన్యూ ఏ మేరకు ప్రభావితం చెందుతుందోనని ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ పడుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే బాహుబలి నుంచి కల్కి దాకా సోలో దండయాత్రలు చేస్తూ వచ్చిన ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత ఇంత పెద్ద కాంపిటీషన్ ని ఫేస్ చేస్తున్నాడు. చూడాలి దీంట్లో ఎలా నెగ్గుకువస్తాడో.

Related Post

Why choose a marriage agency: finding love with guidance and trustWhy choose a marriage agency: finding love with guidance and trust

Discover how a trusted marriage agency offers personalized guidance and serious connections—making your path to lasting love and marriage clear and confident. The post Why choose a marriage agency: finding