hyderabadupdates.com movies రాజుగారు ఆలోచనలో పడ్డారా ఏంటి ?

రాజుగారు ఆలోచనలో పడ్డారా ఏంటి ?

సంక్రాంతి దగ్గరపడే కొద్దీ టాలీవుడ్ బాక్సాఫీస్ దండయాత్ర కోసం సిద్ధపడుతోంది. రెండు డబ్బింగులతో కలిపి మొత్తం ఏడు సినిమాలు బరిలో ఉండటంతో థియేటర్లు, షోల పంపకాలు ఎలా చేస్తారనే దాని మీద ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పబ్లిసిటీ ఎవరికి వారు స్పీడ్ పెంచేశారు. రాజా సాబ్ నుంచి రెండు పెద్ద టీజర్లు, రెండు పాటలు వచ్చేశాయి. మన శంకరవరప్రసాద్ గారు రెండు సాంగ్స్ ఇచ్చేశాడు. మేకింగ్ వీడియో వచ్చేసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇదే ఫాలో అయ్యింది. నారి నారి నడుమ మురారికి వేగం పెంచారు. జన నాయకుడు, పరాశక్తి అనువాదాలు కాబట్టి ఇక్కడ ప్రీ ప్లానింగ్ అవసరం లేదు.

ఇదంతా బాగానే ఉంది కానీ కొన్ని రోజుల నుంచి అనగనగా ఒక రాజు సైలెంట్ అయ్యాడు. పది రోజుల వెనుక వరకు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ఇద్దరూ కలిసి ఈవెంట్లు చేశారు, టూర్లకు వెళ్లారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మౌనంగా ఉండటం చూసి ఫ్యాన్స్ అనుమాన పడుతున్నారు. ఇన్ సైడ్ టాక్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఒక కొలిక్కి వచ్చాయట. ఒక స్పెషల్ సాంగ్ షూట్ వల్ల ప్రచారాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది తప్ప నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు. ఇది వస్తుందనే కారణంతో శర్వానంద్ మూవీకి జనవరి 14 సాయంత్రం నుంచి ప్రీమియర్లను ప్రారంభిస్తున్నారు.

నిర్మాత నాగవంశీకి కంటెంట్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. దర్శకుడు మారి మనకు పరిచయం లేకపోయినా నవీన్ బ్రాండ్ మీద మార్కెటింగ్ జరిగిపోతోంది. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న తమ సినిమా ఖచ్చితంగా నిలబడుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. థియేటర్ల పరంగా కొంత రాజీ పడాల్సి వచ్చినా పూర్తి టాక్ బయటికి వచ్చాక ఆటోమేటిక్ గా అవే పెరుగుతాయనే ధీమా మేకర్స్ లో ఉంది. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 27 జరగనుంది. మెగా చిరు సాంగ్ నెలాఖరుకి వచ్చేస్తుంది. మరి రాజగారు ఎలాంటి ఆలోచన చేయకుండా మాటకు కట్టుబడతారో లేదో చూడాలి.

Related Post