hyderabadupdates.com movies రాజేంద్రుడికి చివరి ఛాన్స్ అయిపోయింది

రాజేంద్రుడికి చివరి ఛాన్స్ అయిపోయింది

సోషల్ మీడియా పుణ్యమా అని.. ఉద్దేశపూర్వకంగా అనని చిన్న చిన్న మాటలు కూడా పెద్ద వివాదానికి దారి తీస్తున్న రోజులు ఇవి. ఈ పరిస్థితుల్లో స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకునే వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆచితూచి మాట్లాడాల్సిందే. కానీ లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మళ్లీ మళ్లీ అదుపు తప్పి మాట్లాడుతున్నారు. ఒకట్రెండు సార్లు అంటే పొరపాటు అనుకోవచ్చు. కానీ పదే పదే నోరు జారుతున్నారంటే ఆయనకేదో సమస్య అయినా ఉండుండాలి. లేదంటే.. లెక్కలేనితనం అయినా అయ్యుండాలి.

అవతలి వ్యక్తులతో తనకు ఎంత సాన్నిహిత్యం ఉన్నా సరే.. స్టేజ్ మీద వాళ్లనుద్దేశించి బూతులు మాట్లాడ్డం ఎంత మాత్రం సంస్కారం అనిపించుకోదు. గత ఏడాది లెజెండరీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి ‘రాబిన్ హుడ్’ ఈవెంట్లో ‘దొంగముండాకొడుకు వీడు’ అనడంతో మొదలైంది ఆయన బూతులు పర్వం. ఆ వ్యాఖ్యలకు తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు. సరదాగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చుకున్నారు.

కట్ చేస్తే తర్వాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో మాట్లాడుతూ.. కమెడియన్ ఆలీని ఉద్దేశించి.. ‘లం..కొడుకు’ అనే బూతు మాట మాట్లాడ్డం మరింత వివాదాస్పదమైంది. ఆయన్ని సినిమా వేడుకలకు పిలవొద్దని.. పిలిచినా మైక్ ఇవ్వొద్దని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కానీ ఇంకో కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే మీ కర్మ’’ అంటూ తనను విమర్శించేవారి మీద ఎదురుదాడి చేశారు. పబ్లిక్ ఈవెంట్లో సంస్కారం తప్పి మాట్లాడి.. దాన్ని తప్పుబట్టిన వారికే సంస్కారం లేదన్నట్లుగా ఆయన కామెంట్ చేయడం విడ్డూరం.

ఈ మధ్య ‘మాస్ జాతర’ ఈవెంట్లో ఈ సినిమా షాక్ ఇవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా అంటూ అవసరం లేని మరో కామెంట్ చేశారు. ఆ కామెంట్ వల్ల వేరే వాళ్లెవ్వరూ ఇబ్బంది పడలేదు కాబట్టి ఓకే. కానీ తాజాగా తెలుగు వాళ్లందరూ అమితంగా ఇష్టపడే బ్రహ్మానందంను ఉద్దేశించి ‘‘ముసలి ముండా కొడుకు నువ్వు’’ అనడం మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ‘‘పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం’’ అంటూ ఆయన బ్రహ్మి గురించి ప్రస్తావించిన తీరు వ్యంగ్యంగా ఉండడమే కాక, ఆయనంటే ఏదో అసూయ ఉన్నట్లుగా అనిపించింది అందరికీ.

‘ముసలి ముండా కొడుకు..’ అంటూ బూతు మాట వాడి.. వెంటనే తప్పు చేశానని గ్రహించి ఆ మాట తనను తాను అనుకున్నట్లు కవర్ చేయబోయారు కానీ.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈసారి టార్గెట్ అయింది బ్రహ్మానందం కావడంతో రాజేంద్ర ప్రసాద్‌‌కు చివరి ఛాన్స్ కూడా అయిపోయినట్లే. ఆయనకు రవ్వంత కూడా సానుభూతి రావట్లేదు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోవట్లేదు. చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఉన్న కాస్త గౌరవాన్ని కూడా ఈ రోజు పోగొట్టుకున్నారంటూ రాజేంద్రుడి మీద విరుచుకుపడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ మీద అభిమానం ఉంటే ఆయన్ని ఈవెంట్లకు పిలవొద్దని.. పిలిచినా మైక్ ఇవ్వొద్దని నొక్కి వక్కాణిస్తున్నారు

Related Post

ధనుష్ పట్టు ఎక్కడుందో అర్థమయ్యిందిగాధనుష్ పట్టు ఎక్కడుందో అర్థమయ్యిందిగా

కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ దెబ్బకు తెలుగులో ఇడ్లి కొట్టుని జనాలు లైట్ తీసుకున్నారు. టాక్ అంతంతమాత్రంగా రావడం, నెగటివ్ రివ్యూలు, ఆడియన్స్ లో ఆసక్తి లేకపోవడం లాంటి కారణాలు చాలా తక్కువ ఓపెనింగ్స్ ని తీసుకొచ్చాయి. కొన్ని మెయిన్