hyderabadupdates.com Gallery రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా

రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా

రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా post thumbnail image

హైద‌రాబాద్ : ఓ వైపు రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, మరో వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడ‌ని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. వెలుగుమ‌ట్ల బాధితుల కోసం చేప‌ట్టిన నిరాహార‌దీక్ష‌ను ఆమె విర‌మించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ప్రజలను క్షమాపణ అడగాలన్నారు
రాజ్యాంగమంటే ఏదో ఒక హారం కాదు. ఈ దేశాన్ని నడిపించే గ్రంథం .పేద ప్రజలకు అన్యాయం చేసిన ప్రభుత్వంపై చర్యలు తీసుకోకపోతే మీరు రాజ్యాంగాన్ని పట్టుకోవటం వృథా అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
ప్రజాపాలన పేరుతో మీరు ప్రజల‌ను వేద‌న‌కు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు క‌విత‌. అసలు ల్యాండ్ ఓనర్ల ఇళ్లను కూల్చే ఇలాంటి సంఘటనలను మనం ఉపేక్షిస్తే…ప్రైవేట్ ప్రాపర్టీలో కూల్చివేతలకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చినట్లవుతుందన్నారు.ఆ తర్వాత ఇలాంటి సంఘటనలే తెలంగాణ మొత్తం జరుగుతాయని హెచ్చ‌రించారు. ప్రజల ఇళ్లు కూల్చేసిన ప్రభుత్వం నిసిగ్గుగా న్యాయం చేస్తున్నామని చెబుతోందన్నారు. ఇవ్వాళ మంత్రులు 310 మందికి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని ప్రకటించారని, డిసెంబర్ 9 న ముఖ్యమంత్రి వచ్చి గృహ ప్రవేశం చేస్తారని భట్టి చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.
కానీ మీరు ఇచ్చిన టోకెన్ ల పై మాకు ఇంకా అనుమానం ఉందన్నారు. లే అవుట్ చేసి ఫిజికల్ ప్రాపర్టీని ప్రతి కుటుంబానికి చూపించాలని క‌విత డిమాండ్ చేశారు. అలా ఇచ్చే వరకు పోరాటం చేస్తామని స‌ర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు క‌విత‌. మీరు కూల్చిన ఇళ్లను కొంతమంది పది లక్షలతో కొంతమంది 20 లక్షలతో కొంతమంది 30 లక్షలతో కట్టుకున్నారు. కానీ మీరు మాత్రం అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెబుతున్నారు. 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తే వారి మిగతా నష్టం ఎవరు భరిస్తారని నిల‌దీశారు.
The post రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రేవంత్ రెడ్డీ నీ ఆట‌లు సాగ‌వు : జీవ‌న్ రెడ్డిరేవంత్ రెడ్డీ నీ ఆట‌లు సాగ‌వు : జీవ‌న్ రెడ్డి

కరీంన‌గ‌ర్ జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం జ‌గిత్యాల‌లో జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో మంత్రి కొల్లు రవీంద్రశ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర

అమ‌రాతి : మోపిదేవిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని శ‌నివారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు . ఆలయానికి వచ్చిన కొల్లు రవీంద్రకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు

సీఎం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీసీఎం చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో త‌న నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి,