hyderabadupdates.com Gallery రాబోయే కాలంలో బీఆర్ఎస్ దే రాజ్యం : కేటీఆర్

రాబోయే కాలంలో బీఆర్ఎస్ దే రాజ్యం : కేటీఆర్

రాబోయే కాలంలో బీఆర్ఎస్ దే రాజ్యం : కేటీఆర్ post thumbnail image

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో రాదో తెలియదని, తాను కూడా గెలుస్తానో లేదో తెలియదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అదిలాబాద్ లో గత ఏడాది చాలా స్పష్టంగా చెప్పాడ‌ని గుర్తు చేశారు. కృష్ణారావును ఎట్టి పరిస్థితుల్లో గెలిపించబోమని కొల్లాపూర్ ప్రజలు మాత్రం ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ఇదే కృష్ణారావు మా పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు అందరికీ తెలుసని, కానీ ఆయ‌న తిన్నంటి వాసాలు లెక్క బెడుతూ ప‌ద‌వి కోసం ఇత‌ర పార్టీలోకి జంప్ అయ్యాడ‌ని ఆరోపించారు కేటీఆర్. అట్లాంటిది రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు.
తన మంత్రి పదవి కాపాడు కోవడం కోసం రేవంత్ రెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అంటున్నాడని ఎద్దేవా చేశారు కేటీఆర్. అవకాశవాదంతో కాంగ్రెస్ లోకి పోయిన నాయకుడు జూపల్లి కృష్ణారావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు .మంత్రి జూపల్లి కృష్ణారావు అరాచకాలను ఎదుర్కొని మరి పంచాయతీ ఎన్నికల్లో కొల్లాపూర్ లో గట్టిగా గెలిచామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే మూడు ముక్కల్లో.. ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు కేటీఆర్. ఒకవైపు ఆరు గ్యారెంటీలను ఎగవేస్తూ.. హైడ్రా వంటి అరాచక విధానాలతో ఇండ్లను కూల్చివేస్తూ.. చెక్ డాంలను పేల్చి వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ ఆరోపించారు. ఇక ఆ పార్టీని జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.
The post రాబోయే కాలంలో బీఆర్ఎస్ దే రాజ్యం : కేటీఆర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానం సీఎం సంతోషంసూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానం సీఎం సంతోషం

అమరావతి : సూక్ష్మ సేద్యం ప‌థ‌కం ( మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి,

చంద్రబాబు సార‌థ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగంచంద్రబాబు సార‌థ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు దూరదృష్టి నాయకత్వం ఫలితమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన తరువాత రాష్ట్రాన్ని

Pawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్‌ తనిఖీPawan Kalyan: మంగళంలోని ఎర్రచందనం గోదాములో డిప్యూటీ సీఎం పవన్‌ తనిఖీ

    తిరుపతి జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి