hyderabadupdates.com movies రామ్ అయోమయం తీరేది ఎప్పుడు

రామ్ అయోమయం తీరేది ఎప్పుడు

ఎనర్జినే ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ కు గత ఏడాది ఆంధ్రకింగ్ తాలూకా ఊహించని షాక్ ఇచ్చింది. కంటెంట్ బాగానే ఉన్నా, రివ్యూస్ పాజిటివ్ గా వచ్చినా బాక్సాఫీస్ వద్ద పెద్దగా పనవ్వలేదు. ప్రేక్షకులు తన నుంచి ఇంకేదో ఆశిస్తున్నారని అర్థమయ్యింది.

అంతకు ముందు ఊర మాస్ యాంగిల్ లో వెళదామని చేసిన వారియర్, రెడ్ లాంటివి కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దీంతో రామ్ సందిగ్ధం కాస్తా అయోమయంగా మారినట్టు కనిపిస్తోంది. అయిదు నెలలు దాటుతున్నా తన కొత్త ప్రాజెక్టు అనౌన్స్ కాలేదు. స్వయంగా తనే ఒక కథ రాసుకుని దర్శకుడి కోసం వెతుకుతున్నట్టు సమాచారం.

వాస్తవంగా చెప్పాలంటే రామ్ ఫ్యాన్ బేస్ పడిపోలేదు. బలంగానే ఉంది. కాకపోతే సరైన సినిమా పడితే మొత్తం యాక్టివ్ అయిపోయి హల్చల్ చేస్తారు. ఎటొచ్చి అలాంటిది పడటం లేదు. హారర్ జానర్ లో ఒక స్క్రిప్ట్ ఓకే చేసినట్టు ఆ మధ్య టాక్ వినిపించింది కానీ అది కూడా రిస్కవుతుందనే ఆలోచనలో పెండింగ్ పెట్టాడట.

హరీష్ శంకర్ తో అనుకుని డ్రాప్ అయినట్టుగా కూడా ఒక టాక్ ఉంది. అసలు ఏ జానర్ చేస్తే బాగుంటుందనే అంతర్మధనం రామ్ లో ఉండొచ్చు. ఎందుకంటే నాని, విజయ్ దేవరకొండ, సాయి దుర్గ తేజ్, తేజ సజ్జ లాంటి వాళ్ళు అధిక శాతం లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు చేస్తున్నారు. రామే వీటికి దూరంగా ఉన్నాడు.

చూస్తుంటే ఈ జానర్ కు షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చిందని చెప్పాలి. లేదూ నేను శైలజ తరహాలో కూల్ ఎంటర్ టైనర్స్ చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. నిజానికి ఈ  సెగ్మెంట్ ని పక్కన పెట్టి ఎక్కువ మాస్ వైపు మొగ్గు చూపడమే రామ్ కు ఎక్కువ చేటు చేసింది.

దానికి ఇస్మార్ట్ శంకరే పునాది వేసిందని వేరే చెప్పనక్కర్లేదు. ఆ మేజిక్ ని పూరినే మళ్ళీ రిపీట్ చేయలేకపోయారు. అంత దారుణంగా సీక్వెల్ పోయింది. అలాంటప్పుడు తిరిగి రామ్ కామ్స్ వైపు రావడంలో తప్పేమీ లేదు. ఒక్క బ్లాక్ బస్టర్ కొడితే అన్నీ సెట్ అయిపోతాయి. సరైన దర్శకుడు, సంగీతం, టీమ్ కుదరాలి అంతే.

Related Post

బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిన మోడీబైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిన మోడీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అంటేనే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి త‌ర‌చుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు.. గీతా జ‌యంతినాడు ఆయ‌న ఏకంగా భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణ కూడా చేస్తారు. ఇటీవ‌ల క‌ర్ణాటక‌లోని శ్రీకృష్ణ మ‌ఠానికి వెళ్లిన‌ప్పుడు కూడా భ‌గ‌వ‌ద్గీత ల‌క్ష గ‌ళ పారాయ‌ణ‌లోనూ

అర్జున్ కష్టానికి ఫలితం జీరోఅర్జున్ కష్టానికి ఫలితం జీరో

సీనియర్ నటుడు అర్జున్ కు యాక్షన్ హీరో అని పేరు. కెరీర్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేశాడు అర్జున్. 90వ దశకంలో జెంటిల్‌మ్యాన్, ఒకే ఒక్కడు చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడాయన. దీంతో పాటు స్వీయ దర్శకత్వంలో నటించిన ‘జైహింద్’ సైతం

నా ముందు అధ్యక్షా అనలేకనే…నా ముందు అధ్యక్షా అనలేకనే…

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి హాజరుపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. జగన్‌ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని ఆయన అన్నారు. అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే ఇస్తామన్నారు. నా ముందు అధ్యక్షా అనడం ఇష్టం లేకనే