hyderabadupdates.com Gallery రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌ post thumbnail image

హైద‌రాబాద్ : అంద‌రి దృష్టి మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ , జాహ్న‌వి క‌పూర్ క‌లిసి న‌టించిన చిత్రం పెద్ది. దీనికి ఉప్పెన ఫేమ్ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ ఖ‌ర్చు పెట్టారు ఈ మూవీ కోసం. ఇప్ప‌టికే సంగీతం అందించిన ఏఆర్ రెహ‌మాన్ సినిమాకు ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా మారింది. త‌ను స్వ‌ర ప‌రిచిన చికిరి చికిరి సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ త‌రుణంలో పెద్ది మూవీ రిలీజ్ పై ఉత్కంఠ నెల‌కొంది. త‌న బాబాయ్ ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సైతం పెద్దితో పాటు విడుద‌ల కానుంద‌ని టాక్.
దీంతో ప‌వ‌ర్ స్టార్ మూవీ కోసం త‌మ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. దీనికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌రో వైపు పెద్ది సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన గ్లింప్స్, చిత్రాలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం చికిరి ట్రెండింగ్ లో కొన‌సాగుతూనే ఉంది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. దేఖ్ లేంగే సాలా అనే సాంగ్ దుమ్ము రేపుతోంది. సామాజిక మాధ్య‌మాల‌ను షేక్ చేస్తోంది. ఈ పాట‌ను త‌న దివంగ‌త తండ్రి స‌త్యానంద్ కు అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు రాక్ స్టార్. మొత్తంగా ఎన్ని సినిమాలు వ‌చ్చినా రాబోయే పెద్దిపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.
The post రామ్ చ‌ర‌ణ్ పెద్ది మూవీపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్

    ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద ఘటనగా కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని పునరుద్ఘాటించింది. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7

ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌స్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్ద‌రామ‌య్య మ‌రో వైపు ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న డీకే శివ‌కుమార్ మ‌ధ్య