hyderabadupdates.com movies రావిపుడి రామాయణం తీస్తే?

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాక ముందే బిజినెస్ వర్గాల్లో హాట్ కేక్ గా మారిపోయింది. ప్యాన్ ఇండియా మూవీసే ఓటిటి అమ్మకాల కోసం కిందా మీద పడుతుంటే వెంకీ అనిల్ 5 కాంబో ఆల్రెడీ క్రేజీ ధరకు సోల్డవుట్ అయిపోయిందని డిజిటల్ వర్గాల కథనం.

దీన్నలా ఉంచితే అనిల్ రావిపూడి త్వరలో ఒక యానిమేషన్ మూవీ హ్యాండిల్ చేయబోతున్నాడనే లీక్ కొద్దివారాల క్రితం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. జన నాయకుడు, టాక్సిక్ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ తీయబోతున్న ఈ గ్రాండియర్ బ్యాక్ డ్రాప్ ఏంటనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది రామాయణలోని ఒక ముఖ్యమైన ఘట్టం లేదా ఆ ఎపిక్ మీద ఆధారపడి రూపొందేలా ఉంటుందట. అదేంటనేది మాత్రం సస్పెన్స.

అధికారిక ప్రకటన లేదు కాబట్టి దీనికి సంబంధించి ఇంతకన్నా వివరాలు ప్రస్తుతానికి లేవు. అయితే కామెడీ పండించడంలో సిద్ధహస్తుడైన అనిల్ రావిపూడి ఇలాంటి పురాణాలను ఎలా హ్యాండిల్ చేస్తాడనే అనుమానం రావడం సహజం. దానికి సమాధానం దొరకాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ తర్వాత యానిమేషన్ కంటెంట్ మీద దర్శక నిర్మాతల ఫోకస్ పెరిగింది. ఇది కూడా అందులో భాగమే అనుకోవాలి.

అయినా ఒక జానర్ కే కట్టుబడకూండా ఇలాంటి ప్రయోగాలు చేయడం అనిల్ కు అవసరమే. ఆ మాటకొస్తే పటాస్ నుంచే మాస్ ఎలిమెంట్స్ తన పట్టు చూపిస్తూ వచ్చిన రావిపూడికి సీరియస్ డ్రామాలు కూడా నడిపించడం వచ్చని తెలియడం మంచిదే. పైగా హాస్యానికి మాత్రమే ఫిక్స్ అయితే మార్కెట్ తెలుగు రాష్ట్రాలు దాటి బయటికి పోదు. అనిల్ ఇన్ని సూపర్ హిట్లు కొట్టినా అవేవి హిందీలో రీమేక్ కాలేదు. సో నార్త్ మార్కెట్ టార్గెట్ చేయాలంటే ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు కావాలి.

Related Post

నాగచైతన్యను భిన్నంగా నిలిపేది అదే..నాగచైతన్యను భిన్నంగా నిలిపేది అదే..

టాప్ స్టార్ల వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ల మీద భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడానికి, స్టార్ ఇమేజ్ పెంచుకోవడానికి వారసత్వ హీరోలు ఎక్కువగా మాస్ సినిమాలు చేయడం, ఎలివేషన్ల కోసం ప్రయత్నించడం చూస్తుంటారు. ప్రతిదీ అభిమానులను దృష్టిలో ఉంచుకునే చేస్తుంటారు. కానీ అక్కినేని కుర్రాడు

Ram Charan inaugurates the first-ever Archery Premier League amidst huge crowd
Ram Charan inaugurates the first-ever Archery Premier League amidst huge crowd

A landmark sporting event unfolded at Ramleela Maidan, New Delhi, as Tollywood star hero Ram Charan inaugurated the first ever Archery Premier League (APL) on the auspicious occasion of Dussehra.