hyderabadupdates.com Gallery రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం

రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం

రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని, ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో యువతకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాల కల్ప‌నే త‌మ స‌ర్కార్ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కంకణ బద్దులై పని చేయాల‌న్నారు. నైపుణ్యం పోర్టల్ మాదిరిగానే ప్రతిఒక్క ఉద్యోగాన్ని ఆధార్/కేవైసీ లింకేజీతో ట్రాక్ చేయాలని ఆదేశించారు. త‌మ‌మ‌ దృష్టిలో చిన్న పరిశ్రమలు, పెద్ద పెట్టుబడులు రెండూ సమానమేన‌ని అన్నారు. ఉద్యోగాల కల్పనే మాకు ముఖ్యం అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. పరిశ్రమల స్థాపన, అనుమతుల విషయంలో సింగపూర్, దుబాయ్ కంటే సులభతరంగా ఉండాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని శాఖలవారీ అనుమతులు, ఎన్వోసీలను మ్యాపింగ్ చేసి వాటి స్థితి, గడువు ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన మాటను నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన చంద్ర‌బాబు నాయ‌క‌త్వం, కేంద్రం స‌హ‌కారంతో త్వ‌రలోనే అనుకున్న టార్గెట్ ను పూర్తి చేస్తామ‌న్నారు.
The post రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ల‌క్ష్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యంఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలుచుకున్న అనంత‌రం జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ త‌న స్వంత స్థ‌లం ముంబైకి చేరుకున్నాడు. ఈ సంద‌ర్బంగా గ్రాండ్ వెల్ కం ల‌భించింది. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున త‌న‌కు ఘ‌నంగా

సీతారాములోరి క‌ళ్యాణానికి పోటెత్తిన భ‌క్తులుసీతారాములోరి క‌ళ్యాణానికి పోటెత్తిన భ‌క్తులు

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్టలో ఇవాళ‌ శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నత అధికారులు, జిల్లా అధికారులతో సమిష్టిగా

రోయా నువ్వే నా సంగీతం నా స‌ర్వ‌స్వంరోయా నువ్వే నా సంగీతం నా స‌ర్వ‌స్వం

పాకిస్తాన్ :ప్ర‌ముఖ పాకిస్తాన్ సింగ‌ర్ అద్నాన్ స‌మీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా గురువారం స్పందించాడు. పదహారు సంవత్సరాల క్రితం నా ప్రియమైన రోయా నాకు ‘అవును’ అని చెప్పింది. ఆ క్షణం నుండే నా జీవితం