hyderabadupdates.com Gallery రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది

రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది

రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది post thumbnail image

మంగ‌ళ‌గిరి : ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ సైకో ముఠా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ, జగన్ వైరస్‌లా మారాయంటూ ఫైర్ అయ్యారు. గత వైసీపీ పాలనలో గాడి తప్పిన పాలనను సీఎం చంద్రబాబు సరి చేస్తున్నారని చెప్పారు. బూతులు తిట్టడం, అనైతిక వ్యాఖ్యలు చేయడం, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ రాజకీయ సిద్ధాంతం అన్నారు. అధికారంలో ఉఉన్నా అధికారం లేకపోయినా ఇదే సిద్ధాంతాన్ని జగన్ అమలు చేస్తున్నారని మండిప‌డ్డారు. రాష్ట్రాభివృద్ధి అన్నా, తెలుగు వాళ్ల అభివృద్ధి అన్న జగన్‌కు గిట్టద‌న్నారు. విద్వేషాలు, విధ్వంసాలతో రాజకీయం చేయడం వైసీపీ డీఎన్ఏలోనే ఉంద‌న్నారు స‌త్య ప్ర‌సాద్.
మాట చాలా శక్తివంతమైనద‌ని, మంచి మాట ఐక్యతను, చెడు మాట అశాంతిని పెంచుతుందని వైసీపీ నాయకులు గ్రహించాలని హిత‌వు ప‌లికారు. అమరావతి రైతులను దూషించడం, మండలి ఛైర్మన్‌పై దాడి చేయడం వైసీపీ రాజకీయ స్వభావానికి నిదర్శనం అన్నారు. . తోట చందయ్యను గొంతు కోసి చంపేశారు. అమర్ అనే 14 ఏళ్ల బాలుడి హత్య చేశారు. వాళ్ల ప్రకారం తాము ప్రతికార్య చర్యలు తీసుకోవడం లేదని అన్నారు అన‌గాని స‌త్య ప్ర‌సాద్. ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా పని చేస్తున్నాం. ఆ కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకున్నాం అని చెప్పారు.
The post రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Yatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్యYatindra Siddaramaiah: మా నాన్న రాజకీయంగా చివరి దశలో ఉన్నారు – యతీంద్ర సిద్ధరామయ్య

Yatindra Siddaramaiah : కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎం సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య (Yatindra Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేసారు. మా నాన్న, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం రాజకీయ జీవిత చరమాంకంలో

మార్చి 26 నుండి శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలుమార్చి 26 నుండి శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి/ఒంటిమిట్ట : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆల‌యంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వ‌ర‌కు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి . ఇందులో భాగంగా ఆల‌యంలో మార్చి 24న

Wing Commander Namansh Syal: వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ కన్నీటి వీడ్కోలుWing Commander Namansh Syal: వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ కన్నీటి వీడ్కోలు

    దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ప్రమాదంలో మృతిచెందిన పైలట్‌, వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామమైన కాంగ్రాలోని పాటియాల్కర్ ప్రాంతానికి తరలించారు. ఆయన భార్య, వింగ్ కమాండర్ అఫ్షాన్.. ఆయనకు తుది వీడ్కోలు