hyderabadupdates.com Gallery రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాం

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాం

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాం post thumbnail image

తాడేప‌ల్లి గూడెం : ఏపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదని అన్నారు, ‘మావిగన్‌ కారిడార్‌’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. మావిగన్‌ కారిడార్‌లో కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు అన్న ఆయన, ఆ ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో పాటు, 110 కి.మీ మేర జాతీయ రహదారి ఉందని, దీంతో రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
అమరావతిలో కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. అమరావతిలో పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు, ఎన్ని దశాబ్ధాలు పడుతుందని ప్ర‌శ్నించారు. అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుందని, దాని వల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయ‌ని, ఇంకా అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని నిల‌దీశారు. చంద్రబాబు తన పనులతో రాజధాని లేకుండా చేస్తున్నారన్న వైయ‹స్‌ జగన్, అందుకే ప్లాన్‌–బి కింద మావిగన్‌ ప్రతిపాదించామని చెప్పారు.
రాష్ట్రంలో పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన పని లేదన్నారు బహుశా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది అన్నది నాకన్నా కూడా మీలో ఎవరికి మైక్‌ ఇచ్చినా నా కన్నా చక్కగా చెబుతారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఎన్నికలు అయిపోయి ఇవాళ రెండు సంవత్సరాలు అయి పోయింది. మూడో సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ కూడా ప్రవేశ పెట్టాడు. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా 5 బడ్జెట్లు ప్రవేశ పెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు మూడు బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశ పెట్టాడు. అంటే మిగిలి ఉన్నది కేవలం రెండే రెండు బడ్జెట్లు.
The post రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదలCM Nitish Kumar: 57 మందితో జేడీయూ తొలి జాబితా విడుదల

CM Nitish Kumar : బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్‌కు (CM Nitish Kumar) చెందిన జనతాదళ్ యునైటెడ్

ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్

హైద‌రాబాద్ : టిజీ విశ్వ ప్ర‌సాద్, కీర్తి ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది రాజా సాబ్. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు మారుతి. అయితే ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా. పాన్ ఇండియా స్థాయిలో తీసినా ఆశించినంత

ISRO Chief Narayanan: అంతరిక్షానికి 80వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు – ఇస్రో చీఫ్‌ISRO Chief Narayanan: అంతరిక్షానికి 80వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు – ఇస్రో చీఫ్‌

ISRO Chief Narayanan : అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్‌ వెల్లడించారు. వాటిలో 80వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారుచేయడం, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి