hyderabadupdates.com Gallery రాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దం

రాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దం

రాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దం post thumbnail image

హైద‌రాబాద్ : న‌టి పూన‌మ్ కౌర్ నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. నిన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ను ఏకి పారేసిన న‌టి తాజాగా త‌న‌కు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, అమెథీ ఎంపీ రాహుల్ గాంధీతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్ర‌క‌టించింది. సినీ , రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఆ మ‌ధ్య‌న రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో త‌ను కూడా పాల్గొంది. ఆయ‌న‌తో పాటు న‌డిచింది. త‌న చేతిని ప‌ట్టుకుని ముందు వ‌రుస‌లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి త‌న‌కు , రాహుల్ గాంధీకి మ‌ధ్య ఏదో ఉందంటూ కొన‌సాగుతున్న దారుణ‌మైన ప్ర‌చారంపై తీవ్రంగా స్పందించింది న‌టి పూన‌మ్ కౌర్. మంగ‌ళ‌వారం సీరియ‌స్ అయ్యింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భాగంగా సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసింది.
త‌న‌కు రాహుల్ గాంధీకి మ‌ధ్య ఎలాంటి బంధం లేద‌ని పేర్కొంది. అయితే ఆయ‌న ముందు చూపు క‌లిగిన నాయ‌కుడు అని పేర్కొంది. కొన్ని మీడియా సంస్థ‌లు కావాల‌ని తామిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోందంటూ పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించింది. ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌చారం చేస్తారంటూ ఆగ్రహం వ్య‌క్తం చేసింది పూన‌మ్ కౌర్. నటి మొదటిసారిగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో తనకు సంబంధం ఉన్న పుకార్లను బహిరంగంగా ప్రస్తావించింది. వ్యక్తిగత సంబంధాన్ని గట్టిగా ఖండించింది. తన చేనేత వ్యాపారానికి సంబంధించి మాత్రమే రాహుల్ గాంధీని కలిశానని , ఒక కార్యక్రమంలో ఆయనతో కొంతకాలం నడిచానని ఆమె స్పష్టం చేసింది. పూనమ్ ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ, తనకు రహస్య పిల్లలు ఉన్నార‌ని కొన్ని సంస్థ‌లు పేర్కొన్నాయంటూ వాపోయింది.
The post రాహుల్ గాంధీతో సంబంధం అబ‌ద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాంఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం

అమరావతి : ఏపీని ప‌ర్యాట‌క హ‌బ్ గా మార్చేస్తామ‌న్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్ర‌బాబు దిశా నిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశ పెట్టిన

పార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలిపార్టీ బ‌లోపేతంపై మ‌రింత ఫోక‌స్ పెట్టాలి

గుంటూరు జిల్లా : ఏపీ తెలుగుదేశం పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ అంటేనే కార్య‌క‌ర్త‌లు అని, వారు లేక పోతే పార్టీ మ‌నుగ‌డ సాధించ‌డం అత్యంత క‌ష్ట‌మ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌గ‌న్ రెడ్డి

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలుIAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

    రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 31 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఆదేశాలు జారీ చేశారు.