hyderabadupdates.com movies రీల్స్ పిచ్చికి రీల్స్ తోనే సమాధానం

రీల్స్ పిచ్చికి రీల్స్ తోనే సమాధానం

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ఓ వర్గం యువత ఎంతకైనా తెగిస్తోంది. ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా, తోటి ప్రయాణికుల భద్రతను కూడా గాలికి వదిలేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. బైక్‌పై వెళ్తూ పక్కనే వెళ్తున్న బస్సులు, ఆటో డోర్లను బలవంతంగా తీస్తూ వీరంగం సృష్టించిన ఒక యువకుడిని ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఖజూరీ ఖాస్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల తుషార్ పునియా తన బైక్‌పై రీల్స్ చేస్తూ రోడ్లపై రచ్చ చేస్తున్నాడు. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళ్తూ, ట్రాఫిక్‌లో వేగంగా కదులుతున్న డీటీసీ బస్సులు, ఇతర వాహనాల దగ్గరకు వెళ్లి, వాటి డోర్లను లాగి తీస్తున్నాడు. ఈ ప్రమాదకరమైన విన్యాసాలను అతని స్నేహితుడు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డుపై వెళ్తున్న వాహనాల డోర్లు అకస్మాత్తుగా తెరుచుకుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో కనీసం ఆలోచించకుండా ఈ యువకుడు ప్రవర్తించాడు. దీనిపై స్పందించిన న్యూ ఉస్మాన్ పూర్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్ ఆధారాలతో తుషార్‌ను గుర్తించారు. గుర్తింపును దాచడానికి బైక్ నంబర్ ప్లేట్ తొలగించినప్పటికీ, పోలీసులు పక్కా ప్లాన్‌తో అతన్ని పట్టుకుని బైక్‌ను సీజ్ చేశారు.

తుషార్‌పై భారతీయ న్యాయ సంహిత, మోటార్ వాహనాల చట్టం కింద పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. కేవలం రీల్స్ కోసం ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టిన ఇతని చర్యను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అతనికి సహకరించిన మరో వ్యక్తి కోసం కూడా గాలింపు చేపట్టారు.

ఇలాంటి పనులు చేసే వారికి ఇది ఒక గుణపాఠం కావాలని పోలీసులు హెచ్చరించారు. సమాజంలో గుర్తింపు కోరుకోవడం తప్పు లేదు, కానీ అది ఇతరులకు హాని కలిగించేలా ఉండకూడదు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు నిబంధనలు పాటించడం మన బాధ్యత. కేవలం ఒక నిమిషం రీల్ కోసం నిండు ప్రాణాలను బలితీసుకునే ఇలాంటి పనుల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు చెబుతున్నారు.

జరిగిన సంఘటనలన్నింటినీ అందరికీ చేరవెయ్యాలని ఒక రీల్ గా ఎడిట్ చేసి ట్రెండింగ్ మ్యూజిక్ పెట్టీ స్వయంగా ఢిల్లీ పోలీసులే వారి అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్టు చెయ్యడంతో రీల్స్ పిచ్చి పట్టిన యువతకి రీల్స్ తోనే సమాధానం చెప్పాలంటూ పోలీసులను అభినందిస్తున్నారు.

Related Post

This director is most likely to helm Rajinikanth-Kamal Haasan multistarrerThis director is most likely to helm Rajinikanth-Kamal Haasan multistarrer

Superstar Rajinikanth and Ulaganayagan Kamal Haasan will be seen together in a film soon, and this is undoubtedly one of the most-awaited films of Tamil cinema. Lokesh Kanagaraj, who previously

ఆది ఆనందానికి అవధులు లేవుఆది ఆనందానికి అవధులు లేవు

చాలా ఏళ్ల నుంచి ఆది సాయికుమార్ పేరుతో ఒక హీరో టాలీవుడ్లో ఉన్నాడనే విషయాన్నే మరిచిపోయారు థియేటర్లకు వెళ్లే తెలుగు ప్రేక్షకులు. ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో ప్రామిసింగ్‌గా మొదలైన అతడి కెరీర్.. తర్వాత గాడి తప్పింది. వరుస ఫ్లాపుల దెబ్బకు

ఎన్టీఆర్, చంద్రబాబు లేకుండా జూబ్లీహిల్స్ ఎన్నిక ముగియదాఎన్టీఆర్, చంద్రబాబు లేకుండా జూబ్లీహిల్స్ ఎన్నిక ముగియదా

స‌మ‌యానికి త‌గు మాట‌లాడ‌డం నాయ‌కుల‌కు వెన్న‌తో పెట్టిన విద్య. ముఖ్యంగా మాట‌ల మాంత్రికులు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌లు ఈ విద్య‌లో ఆరితేరారు. ఎక్క డ త‌మ‌కు అవ‌కాశం ఉంటే.. అక్క‌డ త‌మ మాట‌లు