hyderabadupdates.com Gallery రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు

రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు

రూ. 10  కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు post thumbnail image

హైద‌రాబాద్ : ఓ వైపు డ్ర‌గ్స్ కేసు ఇంకో వైపు బెదిరింపు, రూ. 10 కోట్ల మోసానికి సంబంధించి పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేసిన త‌ర్వాత తీవ్రంగా స్పందించింది సింగ‌ర్ మంగ్లీ. ఆమె మీడియాకు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తన‌కు ఏ పాపం తెలియ‌ద‌ని, తాను అమాయ‌కురాలిన‌ని, త‌న‌కు ఇంకొక‌రిని మోసం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. అయితే ఇండ‌స్ట్రీలో తన‌కున్న జ‌నాద‌ర‌ణ‌ను కొంద‌రు కావాల‌ని క్యాష్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు వాపోయింది. దీనికి తాను ఏం చేయ‌గ‌ల‌నంటూ ప్ర‌శ్నించింది . ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులు పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందడానికి , అధిక రాబడులు ఇస్తామని వాగ్దానం చేసే పథకాన్ని ప్రచారం చేయడానికి త‌న పేరు త‌న‌కు తెలియ‌కుండా వాడుకున్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేసింది సింగ‌ర్ మంగ్లి.
తాను ఎలాంటి మైక్రో ఫైనాన్స్ మోసానికి పాల్ప‌డ‌లేద‌ని , తాను ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది ఈ చిన్న‌ది. అయితే స‌ద‌రు మోసంతో తనను ముడి పెడుతున్న ఆరోపణలను ఖండించింది. అవ‌న్నీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌ల‌ని, అవాస్త‌వ‌మ‌ని, కావాల‌ని తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఉద్దేశించినవని అన్నారు. అయితే సుబ్బారావు అనే అడ్వ‌కేట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంగ్లీపై. ఆమె సోద‌రుడు శివ‌, ఇంకొంద‌రు క‌లిసి త‌న వ‌ద్ద నుంచి రూ. 10 కోట్లు తీసుకున్నార‌ని ఆరోపించారు. దీనిని ఖండించారు సింగ‌ర్ మంగ్లీ. తన గుర్తింపును దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
The post రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వ‌ర‌ల్డ్ క‌ప్ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి ఉండ‌దువ‌ర‌ల్డ్ క‌ప్ ఒకే జ‌ట్టుపై ఆధార‌ప‌డి ఉండ‌దు

న్యూఢిల్లీ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మ‌న్ జే షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చాలా మంది కొన్ని జ‌ట్లు లేకుండా ఎలా ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌శ్నించార‌ని, ఆపై దుష్ప్ర‌చారం చేసేందుకు య‌త్నించార‌ని అన్నారు.

Droupadi Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతిDroupadi Murmu: రఫేల్‌ యుద్ధ విమానంలో రాష్ట్రపతి

Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శత్రు భీకర రఫేల్‌ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు. హరియాణాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన (ఐఏఎఫ్‌) స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగిలోకి దూసుకెళ్లిన ఆమె… దాదాపు

మ‌రాఠా మ‌హిళా క‌మిషన్ చైరప‌ర్స‌న్ రిజైన్మ‌రాఠా మ‌హిళా క‌మిషన్ చైరప‌ర్స‌న్ రిజైన్

ముంబై : రిటైర్డ్ నేవీ ఆఫీస‌ర్ అశోక్ ఖార‌త్ సెక్స్ స్కాండల్ మ‌హారాష్ట్ర స‌ర్కార్ ను కుదిపేస్తోంది. ఈ స్కాంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రూపాలీ చ‌క‌న్క‌ర్. తీవ్ర ఆరోప‌ణ‌లు , విమ‌ర్శ‌లు రావ‌డంతో