hyderabadupdates.com Gallery రూ. 9,319 కోట్ల‌తో 55 ట్రాన్స్ మిష‌న్ ప్రాజెక్టులు

రూ. 9,319 కోట్ల‌తో 55 ట్రాన్స్ మిష‌న్ ప్రాజెక్టులు

రూ. 9,319 కోట్ల‌తో 55 ట్రాన్స్ మిష‌న్ ప్రాజెక్టులు post thumbnail image

అమ‌రావ‌తి : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం క‌లిగిన ఏపీలో కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్ట‌డంతో అభివృద్దితో ప‌రుగులు పెడుతోంది ఏపీ. ఇందులో భాగంగా అన్ని రంగాలు ముఖ్య భూమిక‌ను పోషిస్తున్నాయి. ఈ మేర‌కు ఏపీ ట్రాన్స్ కో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈఏడాది భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న‌ట్లు తెలిపింది. రూ. 9,000 కోట్ల‌కు పైగా విలువైన 55 ట్రాన్స్ మిష‌న్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీని వ‌ల్ల విద్యుత్ ప‌రంగా రాష్ట్ర గ్రిడ్ కు 8,853 ఎంవీఏ పరివర్తన సామర్థ్యం , 1,558 సర్క్యూట్ కి.మీ ట్రాన్స్‌మిషన్ లైన్లు జోడించనున్నారు. ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి. సూర్య సాయి ప్రవీన్ చంద్ మాట్లాడారు .
విజయవాడలోని విద్యుత్ సౌధలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కీల‌క‌మైన వివ‌రాఆలు పంచుకున్నారు. 55 ట్రాన్స్ మిష‌న్ ప్రాజెక్టుల విలువ దాదాపు రూ 9,300 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌న్నారు. నమ్మకమైన విద్యుత్ సరఫరా కోసం కాకినాడ సెజ్, అచ్యుతపురం, గుడివాడ , అయినవల్లిలోని వ్యూహాత్మక ప్రదేశాలలో కొత్త 400/220/132 kv సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తామ‌న్నారు . రాష్ట్ర విద్యుత్ రంగాన్ని దేశంలోనే అత్యుత్తమంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు ప్రసార మౌలిక సదుపాయాల విస్తరణ, వ్యవస్థ ఆధునీకరణ , అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడానికి అగ్ర ప్రాధాన్యత ఇవ్వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు ప్ర‌వీణ్ చంద్ . అంతే కాకుండా 380 సబ్‌స్టేషన్లు, 71,049 ఎంవీఏ మొత్తం సామర్థ్యంతో 1,030 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 33,000 సర్క్యూట్ కిలోమీటర్లకు పైగా హై వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ లైన్లను నిర్వహిస్తున్నట్లు ప్రవీణ్‌చంద్ తెలిపారు.
The post రూ. 9,319 కోట్ల‌తో 55 ట్రాన్స్ మిష‌న్ ప్రాజెక్టులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కేశినేని నాని ఆశీస్సులతోనే కొలికపూడి కుట్ర!కేశినేని నాని ఆశీస్సులతోనే కొలికపూడి కుట్ర!

కృష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు- విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం తెలుగుదేశం పార్టీకి నష్టదాయకంగా పరిణమించేలా ముందుకు సాగుతోంది. తన మాటల్లో పైకి నారా చంద్రబాబు నాయుడును, లోకేష్ ను కీర్తిస్తూనే ఉన్నప్పటికీ కేశినేని చిన్ని

గుజ‌రాత్ న‌మూనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌నగుజ‌రాత్ న‌మూనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌న

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుజరాత్ నమూనా స్ఫూర్తితో స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా గుజరాత్ నమూనాను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మరో 700 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అంతే

Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌

Prashant Kishor : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో ప్రచారం జోరందుకుంటోంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సొంత నియోజకవర్గమైన రాఘోపుర్‌ నుంచి జన్‌సురాజ్‌ పార్టీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తేజస్వీ యాదవ్ పై ఆ పార్టీ