hyderabadupdates.com movies రెహమాన్… ఇదయ్యా మీ అసలు రూపం

రెహమాన్… ఇదయ్యా మీ అసలు రూపం

సోషల్ మీడియాని చికిరి చికిరి పాట ఊపేస్తోంది. ఇన్స్ టా రీల్స్ వెల్లువలా వచ్చి పడుతుండగా ట్వీట్ల గురించి చెప్పుకుంటూ పోతే పుస్తకమే అవుతుంది. పేరుకి లిరికలే అయినా దాదాపు వీడియో సాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేయడం వెనుక దర్శకుడు బుచ్చిబాబు ఆలోచన ఎంత దూరదృష్టితో ఉందో అభిమానులకు అర్థమైపోయింది. రామ్ చరణ్ గ్రేస్ మొత్తాన్ని పిండేశారా అనే రేంజ్ లో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు చిన్నా పెద్ద తేడా లేకుండా తెగ కనెక్ట్ అయిపోతున్నాయి. ఏఐ, విఎఫ్ఎక్స్, గ్రీన్ మ్యాట్ లేకుండా రియల్ లొకేషన్లలో చిత్రీకరించిన బుచ్చిబాబు కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తోంది.

ఇక ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏఆర్ రెహమాన్ గురించి. కొంత కాలంగా ఆయన ఫామ్ లో లేరు. పొన్నియిన్ సెల్వన్ లాంటి వాటికి మంచి మ్యూజిక్ ఇచ్చినా ఒకప్పటి వింటేజ్ వైబ్ రాలేదన్నది ఫ్యాన్స్ సైతం ఒప్పుకుంటారు. అలాంటిది పెద్ది లాంటి రా విలేజ్ డ్రామాకు ఎలాంటి పాటలు ఇస్తారనే అనుమానం రావడం సహజం. వాటిని పటాపంచలు చాలా క్యాచీ ట్యూన్ తో చికిరి చికిరి అంటూ రెహమాన్ చేసిన అల్లరి ఏకంగా పుష్ప కిసిక్ సాంగ్ రికార్డులను సైతం దాటేసి నెంబర్ వన్ స్థానం వైపు దూసుకుపోయేలా చేసింది. ఒక్క తెలుగు వెర్షనే రోజు గడవకుండానే 28 మిలియన్ల వ్యూస్ దాటడం మాములు విషయం కాదు.

తమిళ వర్షన్ ఆలస్యంగా ఈ రోజు విడుదల చేయడం వల్ల కౌంట్ కొంచెం తగ్గినప్పటికీ ఓవరాల్ గా అన్ని భాషలు కలిపి నలభై మిలియన్లకు పైగా వ్యూస్ రావడం మెగా ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గేమ్ ఛేంజర్ లో ఏవైతే ట్రోలింగ్ కు గురయ్యాయో సరిగా వాటికి సమాధానం చెప్పేందుకు అనే రేంజ్ లో బుచ్చిబాబు చరణ్ ని చూపించిన విధానం చార్ట్ బస్టర్ ఇచ్చేసింది. నిన్నటి దాకా సౌండ్ చేసిన మన శంకరవరప్రసాద్ గారులోని మీసాల పిల్ల హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. చిరంజీవి స్టైల్ ని రామ్ చరణ్ గ్రేస్ టేకోవర్ చేసింది. ఏమైనా రెహమాన్, చరణ్, బుచ్చి ముగ్గురు కలిసి విధ్వంసం చేసేశారు.

Related Post

1500 స్క్రీన్లలో ఎవర్ గ్రీన్ క్లాసిక్1500 స్క్రీన్లలో ఎవర్ గ్రీన్ క్లాసిక్

భారతీయ చలనచిత్ర గమనాన్ని మార్చిన సినిమాల్లో మొదటగా గుర్తొచ్చేపేరు షోలే. 1975లో విడుదలైన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సృష్టించిన రికార్డుల గురించి రాస్తూ పోతే పుస్తకాలు సరిపోవు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలను అతి పెద్ద కమర్షియల్ హీరోలుగా మార్చడంలో షోలే

“Raju Weds Rambai” Trailer Wins Hearts with Its Pure, Native Love Story“Raju Weds Rambai” Trailer Wins Hearts with Its Pure, Native Love Story

The trailer of Raju Weds Rambai has struck a chord with audiences for its soulful portrayal of a rustic, emotional village love story. Starring Akhil Uddeamari and Tejaswini Rao in