hyderabadupdates.com movies రెహమాన్ కన్నా బుచ్చిబాబు మీదే నమ్మకం

రెహమాన్ కన్నా బుచ్చిబాబు మీదే నమ్మకం

పెద్ది ఫస్ట్ ఆడియో సింగల్ ఈ వారంలోనే విడుదలయ్యేలా ఉంది. హైదరాబాద్ లో ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ సందర్భాన్ని పురస్కరించుకుని దానికి ముందుగానే సాంగ్ రిలీజ్ చేసి, ఈవెంట్ లో ప్రత్యక్షంగా స్టేజి మీద ఆలపించబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. నిన్న రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో వాట్స్ కుకింగ్ అంటూ గాయకుడు మోహిత్ చౌహాన్, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు ఉన్న ఫోటో పెట్టడం ఫ్యాన్స్ మధ్య వైరల్ టాపిక్ అయ్యింది. తలా సంభవం అంటూ ఫ్యాన్స్ దాన్ని తెగ తిప్పేశారు. చికిరి అంటూ సాగే మొదటి పాట చాలా బాగా వచ్చిందని, శ్రీలంక విజువల్స్ గొప్పగా ఉంటాయని టీమ్ తెగ ఊరిస్తోంది.

రెహమాన్ ఎంత లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ ఆయనలో మునుపటి ఫామ్ లేదనేది మ్యూజిక్ లవర్స్ ఎప్పటి నుంచో ఇస్తున్న కంప్లయింట్. ఆయనలో మేజిక్ తగ్గిపోయినా అవకాశాలకు లోటు లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ది లాంటి గ్రాండియర్ బాధ్యతలు ఆయనకు ఇవ్వడం ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ లోనే అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కోరుకున్న విధంగా ట్యూన్స్ రాబట్టుకోవడంలో బుచ్చిబాబు పనితనం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. అందుకే రెహమాన్ కన్నా ఎక్కువ నమ్మకం జనాలు బుచ్చిబాబు మీదే పెట్టుకున్నారు. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనదే.

మార్చి 27 సినిమా రిలీజ్ డేట్ కు అనుగుణంగానే పనులు, షూటింగ్ జరుగుతున్నాయి. పాటలతో పాటు కీలక భాగాలు ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ వచ్చే ఫిబ్రవరికల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేలా బుచ్చిబాబు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. పెద్ది మొదటి పాట చార్ట్ బస్టర్ కావడం చాలా కీలకం. ఎందుకంటే ట్రైలర్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈలోగా బిజినెస్ పరంగా క్రేజ్ తేవాల్సిన బాధ్యత సాంగ్స్ మీద ఉంటాయి. అందుకే మెగా ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఒక పెద్ద స్ట్రెయిట్ హిట్ లేని ట్రక్ రికార్డుని ఏఆర్ రెహమాన్ పెద్దితో తీరుస్తారేమో చూడాలి.

Related Post

ఒక్క ఫ్లాపుతో మొత్తం తలకిందులుఒక్క ఫ్లాపుతో మొత్తం తలకిందులు

కూలీ విడుదల ముందు వరకు రాజమౌళి రేంజ్ లో హైప్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు కేవలం ఒక్క ఫ్లాప్ మొత్తం తలకిందులు చేసేసింది. అయిదు వందల కోట్ల గ్రాస్ వసూలు చేసినా, అంచనాలు అందుకోలేకపోవడంతో కమర్షియల్ లెక్కల్లో అపజయాల

`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!

ఎర్ర‌చంద‌నం.. ఏపీలో మాత్ర‌మే.. అది కూడా తిరుప‌తి జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో మాత్ర‌మే ల‌భించే అరుదైన వృక్షాలు. అయితే.. వీటిని అక్ర‌మార్కులు తెగ‌న‌రికి పెద్ద ఎత్తున ర‌వాణా చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి అమాయ‌కులైన ఏపీ, తెలంగాణ పౌరుల‌ను, కూలీల‌ను