hyderabadupdates.com movies రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు వ్యక్తం చేయడం తెలిసిందే. అసలే పెద్దగా ఫామ్ లో లేరు, పైగా టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు ఆయన ఇచ్చే మ్యూజిక్ అంత కలిసి రాలేదనే సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. కొమరం పులికి డిజాస్టర్ సాంగ్స్ ఇచ్చారు. సైరాని వదులుకున్నారు. ఇన్ని నెగటివ్ వైబ్స్ మధ్య రెహమాన్ కాంబో గురించి అభిమానులు టెన్షన్ పడిన మాట వాస్తవం. అయితే చికిరి చికిరి ఆ డౌట్లన్నీ గ్రౌండ్ అవతల విసిరేసింది. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా యునానిమస్ ఛార్ట్ బస్టర్ అనిపించుకుంది.

మొదటి ఘట్టం దిగ్విజయంగా పూర్తయ్యాక ఇప్పుడు రెండో సాంగ్ రాబోతోంది. రైరై అంటూ సాగే హీరో పరిచయ గీతాన్ని మార్చి 2 విడుదల చేయబోతున్నారు. రేపు ప్రోమో వచ్చే అవకాశముంది. యూనిట్ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారమైతే రెహమాన్ మరోసారి గెలిచేశారు.

టైటిల్ సాంగ్ కాబట్టి జానీ మాస్టర్ నేతృత్వంలో రామ్ చరణ్ స్టెప్పులు, ట్యూన్ కంపోజింగ్, బుచ్చిబాబు టేకింగ్ ఒకదానితో మరొకటి పోటీ పడి మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయట. మరో సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాని ఊపేయడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. ఇది నిజమైన పక్షంలో ఎక్స్, ఇన్స్ టా రీల్స్ దీంతో మ్రోగిపోవడం ఖాయం.

ఏప్రిల్ 30 విడుదల తేదీ మీద నెలకొన్న అనుమానాలకు వివిధ రూపాల్లో టీమ్ చెక్ పెడుతోంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఆల్రెడీ ప్రమోషన్లు మొదలుపెట్టగా, ఉస్తాద్ భగత్ సింగ్ దగ్గరలో ఉన్నా సరే పెద్దికి కూడా సమాంతర పబ్లిసిటీ చేయడానికి పెద్దిలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న మైత్రి ప్లానింగ్ చేస్తోంది.

గత కొన్నేళ్లుగా పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఏదో ఒకటో రెండో పాటలే బాగుంటున్న ట్రెండ్ లో రెహమాన్ కనక కంప్లీట్ ఆల్బమ్ ని హిట్ చేయగలిగితే బిజినెస్ పరంగా హిందీ, తమిళంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ‘నీ అయ్య వడ్డీ నువ్వు బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే” అంటూ లిరిక్స్ కూడా ఊర మాస్ ఉండబోతున్నాయి.

Related Post

వారందరికీ కర్ణాటక, ఏపీలో సోషల్ మీడియా బ్యాన్!వారందరికీ కర్ణాటక, ఏపీలో సోషల్ మీడియా బ్యాన్!

చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు దక్షిణాది రాష్ట్రాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఈ నిర్ణయాన్ని