hyderabadupdates.com movies రేప‌టి నుంచి సీఎం చంద్ర‌బాబు లండ‌న్ టూర్‌

రేప‌టి నుంచి సీఎం చంద్ర‌బాబు లండ‌న్ టూర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇటీవలే.. దుబాయ్‌లో మూడు రోజుల పాటు ప‌ర్య‌టించారు. పెట్టుబడుల వేట‌లో ఉన్న ఆయ‌న‌.. గ‌ల్ఫ్ దేశాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసి.. పెట్టుబ‌డిదారుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించారు. అదేవిధంగా దుబాయ్ మంత్రుల‌తోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ప్ర‌వాసాంధ్రుల‌ను క‌లిసి.. పీ-4లో భాగ‌స్వామ్యం కావాల‌ని కోరారు. ఇలా.. మూడు రోజుల పాటు అనేక మందిని క‌లిసి పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలో మ‌రోసారి చంద్ర‌బాబు పెట్టుబ‌డుల వేట‌కు వెళ్తున్నారు. రేప‌టి(శ‌నివారం, న‌వంబ‌రు 1) నుంచి 5 రోజులపాటు లండన్‌ పర్యటనలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌ల‌ను క‌లిసి.. రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించ‌నున్నారు. ముఖ్యంగా అమ‌రావ‌తి, విశాఖ‌ప‌ట్నం లో ఇప్ప‌టికే పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌తోపాటు.. మ‌రిన్ని అవ‌కాశాలు క‌ల్పించే విష‌యంపై వారితో చ‌ర్చించ‌నున్నారు.

అదేవిధంగా విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. విశాఖ‌లో న‌వంబ‌రు 14, 15 తేదీల్లో పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. దీనికి వారిని రావాల‌ని కోర‌నున్నారు. అదేవిధంగా లండ‌న్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్‌షోలో సీఎం చంద్ర‌బాబు పాల్గొంటారు. అదేవిధంగా ప్ర‌వాసాంధ్రుల‌తోనూ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. ముఖ్య‌మంత్రి వెంట‌.. మంత్రులు టీజీ భ‌ర‌త్‌, బీసీ జ‌నార్ద‌న్‌రెడ్డి, ఉన్నతాధికారులు కూడా లండ‌న్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. కాగా.. నవంబర్‌ 6న తిరిగి సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు.

Related Post

సజ్జల కాదు.. జగన్‌నే అసలు సమస్య..?సజ్జల కాదు.. జగన్‌నే అసలు సమస్య..?

వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి. ఆయన వ్యవహార శైలిని చాలా మంది తప్పుబట్టారు. సజ్జల కారణంగానే పార్టీ నుంచి బయటకు వచ్చామని కొందరు రెడ్డి నాయకులు

ఉస్తాద్ తర్వాత పవన్ ప్లానింగ్ ఏంటిఉస్తాద్ తర్వాత పవన్ ప్లానింగ్ ఏంటి

సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు ఉస్తాద్ భగత్ సింగ్ తో పూర్తయిపోయాయి. నిర్మాత రామ్ తాళ్ళూరిది ఒక్కటే బ్యాలన్స్ ఉంది. అయితే ఆయన ఇప్పటికిప్పుడు చేయమని ఒత్తిడి పెట్టడం లేదు. కాకపోతే దర్శకుడు సురేందర్ రెడ్డి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం

చిరంజీవికి కొత్త టెన్షన్ షురూచిరంజీవికి కొత్త టెన్షన్ షురూ

భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఇంత సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని ఊహించినవాళ్లు తక్కువే. అనిల్ రావిపూడి ఆయన్ని బాగా ప్రెజెంట్ చేస్తారనే నమ్మకమున్నా మరీ ఈ స్థాయిలో రికార్డుల బూజు దులిపేస్తారని ఎంతమంది అనుకుని