hyderabadupdates.com movies రేప‌టి నుంచి సీఎం చంద్ర‌బాబు లండ‌న్ టూర్‌

రేప‌టి నుంచి సీఎం చంద్ర‌బాబు లండ‌న్ టూర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇటీవలే.. దుబాయ్‌లో మూడు రోజుల పాటు ప‌ర్య‌టించారు. పెట్టుబడుల వేట‌లో ఉన్న ఆయ‌న‌.. గ‌ల్ఫ్ దేశాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేసి.. పెట్టుబ‌డిదారుల‌తో వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హించారు. అదేవిధంగా దుబాయ్ మంత్రుల‌తోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ప్ర‌వాసాంధ్రుల‌ను క‌లిసి.. పీ-4లో భాగ‌స్వామ్యం కావాల‌ని కోరారు. ఇలా.. మూడు రోజుల పాటు అనేక మందిని క‌లిసి పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలో మ‌రోసారి చంద్ర‌బాబు పెట్టుబ‌డుల వేట‌కు వెళ్తున్నారు. రేప‌టి(శ‌నివారం, న‌వంబ‌రు 1) నుంచి 5 రోజులపాటు లండన్‌ పర్యటనలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌ల‌ను క‌లిసి.. రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించ‌నున్నారు. ముఖ్యంగా అమ‌రావ‌తి, విశాఖ‌ప‌ట్నం లో ఇప్ప‌టికే పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌తోపాటు.. మ‌రిన్ని అవ‌కాశాలు క‌ల్పించే విష‌యంపై వారితో చ‌ర్చించ‌నున్నారు.

అదేవిధంగా విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. విశాఖ‌లో న‌వంబ‌రు 14, 15 తేదీల్లో పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. దీనికి వారిని రావాల‌ని కోర‌నున్నారు. అదేవిధంగా లండ‌న్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్‌షోలో సీఎం చంద్ర‌బాబు పాల్గొంటారు. అదేవిధంగా ప్ర‌వాసాంధ్రుల‌తోనూ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. ముఖ్య‌మంత్రి వెంట‌.. మంత్రులు టీజీ భ‌ర‌త్‌, బీసీ జ‌నార్ద‌న్‌రెడ్డి, ఉన్నతాధికారులు కూడా లండ‌న్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. కాగా.. నవంబర్‌ 6న తిరిగి సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు.

Related Post

పవన్ అభిమానులతో హరీష్ రాజీపవన్ అభిమానులతో హరీష్ రాజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అత్యంత ఆనందాన్నిచ్చి, వారిని తీవ్ర భావోద్వేగానికి గురి చేసిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. దాదాపు పదేళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న పవన్‌కు 2012లో ‘గబ్బర్ సింగ్’ రూపంలో మరపురాని

ప్ర‌భాస్ అంద‌రికీ తినిపిస్తాడు కానీ త‌ను మాత్రం…ప్ర‌భాస్ అంద‌రికీ తినిపిస్తాడు కానీ త‌ను మాత్రం…

ప్ర‌భాస్‌తో క‌లిసి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రూ త‌న గురించి మాట్లాడాల్సి వ‌చ్చిన‌పుడు.. అత‌ను క‌డుపు ప‌గిలిపోయేలా ఎలా ఫుడ్డు పెట్టి చంపేస్తాడో చెబుతుంటారు. ప్ర‌భాస్‌తో కొత్తగా సినిమా చేసిన వాళ్లు.. అత‌డి ఇంటి నుంచి వ‌చ్చే క్యారేజీల గురించి సోష‌ల్

Official Trailer for ‘Spooktacular’ Doc on the First Horror Theme Park
Official Trailer for ‘Spooktacular’ Doc on the First Horror Theme Park

“SpookyWorld is the Disney World for the Halloween crowd.” Quiver has revealed the official trailer for a documentary film titled Spooktacular, being released in early October in time for the