కేరళ : కేరళ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటతిల్ కు బిగ్ షాక్ తగిలింది. రేప్ చేసిన కేసులో తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలుకు తరలించారు. గత డిసెంబర్ 2024లో పాలక్కాడ్ ఉప ఎన్నికలో రాహుల్ సాధించిన అద్భుత విజయం తర్వాత ఈ రేప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయినా వాటిని లెక్క చేయలేదు. చివరకు అరెస్ట్ చేయడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి సాన్నిహిత్యం పెంచుకోవడం, బిడ్డ కావాలనే నెపంతో లైంగిక సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత మహిళ గర్భవతి అయినప్పుడు బెదిరింపులతో సంబంధాన్ని తెంచుకోవడం చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రాహుల్ కు 37 ఏళ్లు. తనను తదుపరి విచారణ కోసం పతనం తిట్ట జిల్లాకు విచారణ నిమిత్తం తరలించారు.
అతన్ని పతనంతిట్టలోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు . ఇదిలా ఉండగా ఎమ్మెల్యేపై వరుసగా నమోదైన కేసు ఇది మూడోది. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన ఒక మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం, గతంలో కాంగ్రెస్ నుండి బహిష్కరించబడిన మమ్కూటతిల్, ఒక వివాహిత మహిళను హోటల్‌కు పిలిచి అత్యాచారం చేశాడని, అలాగే ఆమెపై బలవంతంగా గర్భస్రావం చేయించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతర కేసులలో అతన్ని అరెస్ట్ చేయకుండా కోర్టు గతంలో పోలీసులను నిరోధించినప్పటికీ, తాజా ఫిర్యాదులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
The post రేప్ కేసులో కేరళ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటతిల్ అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
రేప్ కేసులో కేరళ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటతిల్ అరెస్ట్
Categories: