hyderabadupdates.com movies రైతులకు బాబుకు మధ్య గ్యాప్ చెరిగిపోతుంది

రైతులకు బాబుకు మధ్య గ్యాప్ చెరిగిపోతుంది

రైతులకు చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం రాజకీయాల్లో ఉంది. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రాధాన్యం సీఎం చంద్రబాబు అన్నదాతలకు ఇవ్వరని, వారి కష్టాలు పట్టించుకోరని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తారు. రైతు బాంధవులు అంటే వైఎస్ కుటుంబమేనని కూడా చెబుతుంటారు. అయితే దీనికి విరుగుడుగా చంద్రబాబు ఇప్పుడు అన్నదాతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతన్నలను టార్గెట్‌గా చేసుకుని రాజకీయాల్లో దూకుడు పెంచారు.

దీనిలో భాగంగానే టైം ప్రకారం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికి రెండు విడతల్లో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలను నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు అందించారు. ఇక తుఫాను, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వారి కష్టాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ఐదు కీలక సూత్రాలతో పంచ సూత్ర ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు.

ఇటీవల కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ ఐదు సూత్రాలను ప్రకటించారు. వీటివల్ల రైతులకు నష్టాలు రాకుండా మరిన్ని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. పైగా ఎవరో వచ్చి వారి దిగుబడిని కొనుగోలు చేసే వరకు ఎదురు చూడకుండా, రైతులే ముందుకు వచ్చి ప్రత్యక్షంగా విక్రయించుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విధంగా పంచ సూత్రాలను చంద్రబాబు ప్లాన్ చేశారు.

అయితే చంద్రబాబు అక్కడితో ఆగలేదు. ఏదో ఒక కార్యక్రమం ప్రకటించి చేతులు దులుపుకోలేదు. ఆ తర్వాత మరింత పక్కాగా ఈ సూత్రాలను అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్లి నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇందులో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కూడా పాల్గొనాలని నిర్ణయించారు. తద్వారా రైతులకు చంద్రబాబుకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేలా పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు.

ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Related Post

హాట్ ప్రియాంక మోహన్‌.. అవి ఒరిజినల్ కాదుహాట్ ప్రియాంక మోహన్‌.. అవి ఒరిజినల్ కాదు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పుణ్యమా అని.. సోషల్ మీడియాలో కనిపించే ఫొటోలు, వీడియోల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని అయోమయం నెలకొంది. ఏ కొత్త సాంకేతికత వచ్చినా దాన్ని చెడు మార్గంలో ఉపయోగించడానికి చూసే వాళ్లు చాలామందే ఉంటారు. ఏఐని కూడా అలా వాడుతున్న వాళ్లకు