hyderabadupdates.com Gallery రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌

రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌

రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌ post thumbnail image

అమరావతి : గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యం నుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆక్వాక‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ఆథారిటీ (APSADA) కో-వైస్ ఛైర్మన్, నాన్-ఆఫీషియల్ కమిటీ సభ్యులు, అక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియా లో వచ్చిన వార్తలు, మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మన దేశ సముద్ర ఆహార ఎగుమతులపై చూపే ప్రభావం గురించి చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మధ్యప్రాచ్య (గల్ఫ్) ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై ప్రభావం ఉంటుందనే భయంతో ముందస్తు లేదా పానిక్ హార్వెస్టింగ్ చేయడం సరికాదని రైతులకు సూచించారు. భారతదేశం నుండి జరిగే మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లేది కేవలం 3,4 శాతం మాత్రమేనని, అది కూడా ప్రధానంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా జరుగుతుందని తెలిపారు. ఇతర దేశాలకు యూరోపియన్ యూనియన్ (EU), అమెరికా (USA), జపాన్, చైనా వంటి దేశాలకు వెళ్లే సముద్ర ఆహార కంటైనర్లు రెడ్ సీ సూయెజ్ కాలువ మార్గం, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం, చైనా సముద్ర మార్గం ద్వారా నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని చెప్పారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితులు భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
The post రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Chandigarh: చండీగఢ్‌ బిల్లుపై కేంద్రం ఆశక్తికర వ్యాఖ్యలుChandigarh: చండీగఢ్‌ బిల్లుపై కేంద్రం ఆశక్తికర వ్యాఖ్యలు

    కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పంజాబ్‌లోని పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో

సంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీసంజూ శాంస‌న్ ఆడ‌డంపై గంభీర్ నో క్లారిటీ

ముంబై : ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో వ‌రుస‌గా విజ‌యాలు సాధించినా ఆ జ‌ట్టును, మేనేజ్ మెంట్ ను ప్ర‌ధాన స‌మ‌స్య వెంటాడుతూనే ఉంది. ప‌నిగ‌ట్టుకుని స్టార్ ప్లేయ‌ర్లు శాంస‌న్, అభిషేక్ శ‌ర్మ‌ల‌ను ప్ర‌మోట్ చేశారు

Rishab Shetty Denies Reports of Production Issues for Kantara: Chapter 1Rishab Shetty Denies Reports of Production Issues for Kantara: Chapter 1

Actor-director Rishab Shetty has dismissed recent reports suggesting that the production of Kantara: Chapter 1 faced multiple challenges and shooting delays. Speaking at a recent event in Mumbai, Rishab clarified