hyderabadupdates.com Gallery రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌

రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌

రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌ post thumbnail image

అమరావతి : గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యం నుండి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆక్వాక‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్మెంట్ ఆథారిటీ (APSADA) కో-వైస్ ఛైర్మన్, నాన్-ఆఫీషియల్ కమిటీ సభ్యులు, అక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియా లో వచ్చిన వార్తలు, మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మన దేశ సముద్ర ఆహార ఎగుమతులపై చూపే ప్రభావం గురించి చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మధ్యప్రాచ్య (గల్ఫ్) ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మీడియాలో వచ్చిన వార్తల వల్ల కొంతమంది ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై ప్రభావం ఉంటుందనే భయంతో ముందస్తు లేదా పానిక్ హార్వెస్టింగ్ చేయడం సరికాదని రైతులకు సూచించారు. భారతదేశం నుండి జరిగే మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లేది కేవలం 3,4 శాతం మాత్రమేనని, అది కూడా ప్రధానంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా జరుగుతుందని తెలిపారు. ఇతర దేశాలకు యూరోపియన్ యూనియన్ (EU), అమెరికా (USA), జపాన్, చైనా వంటి దేశాలకు వెళ్లే సముద్ర ఆహార కంటైనర్లు రెడ్ సీ సూయెజ్ కాలువ మార్గం, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం, చైనా సముద్ర మార్గం ద్వారా నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని చెప్పారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితులు భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
The post రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు శాంస‌న్ ఇలా ఆడితే ఎలా..?సంజు శాంస‌న్ ఇలా ఆడితే ఎలా..?

చెన్నై : ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఆశించిన మేర రాణిండ‌చం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మెగా టోర్నీలో రెండు మ్యాచ్ లు ఆడింది. ప్రారంభ మ్యాచ్ బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌గా ఆర్సీబీ చేతిలో

Driverless Car: బెంగళూరులో మొదటి డ్రైవర్‌ రహిత కారుDriverless Car: బెంగళూరులో మొదటి డ్రైవర్‌ రహిత కారు

Driverless Car : అమెరికాలో వైమో సంస్థ డ్రైవర్‌ రహిత కార్లను (Driverless Car) ట్యాక్సీలుగా నడుపుతున్నట్లే… బెంగళూరు నగర ఆర్‌వీ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు డ్రైవర్‌ అవసరం లేని కారు (Driverless Car) తయారీ చేపట్టారు. ఉత్తరాది మఠానికి చెందిన

సెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డిసెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డి

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఉపేంద‌ర్ రెడ్డి గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సంస్థ పురోగతికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు.. సంస్థను మరింత బలోపేతం చేయడమే తన